డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే సినిమాలు చెయ్యకూడదా. ఇదెక్కడి విచిత్రం, ఆయన ప్రొఫెషన్ సినిమాలు. నటుడిగా అభిమానులకు దగ్గరైన ఆయన రాజకీయాల్లోకి వెళ్లి అధికారంలోకి వస్తే సినిమాలు మానెయ్యాలా, అభిమానులను దూరం చేసుకోవాలా.. ఇదెక్కడి న్యాయం. అదే హైకోర్టు కూడా అంటుంది. అసలు ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని కోర్టు స్పష్టం చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఆయన ప్రజల కోసం పని చెయ్యాలి కానీ సినిమాలు చేసుకుని డబ్బు సంపాదించడం కరెక్ట్ కాదు అంటూ.. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని పిటిషనర్ ఆరోపించారు.
వీరమల్లు టికెట్ ధరల పెంపు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని పిటిషన్ వేశారు. దానితో విచారణకు వచ్చిన ఈకేసులో ప్రభుత్వం తరఫున న్యాయవాది.. మంత్రి అయితే సినిమా చేయ్యకూడదు అనే రూల్ లేదు అని, గతంలో ఎన్టీఆర్ సీఎం గా ఉండి సినిమాలు చేసారు. అందుకు హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. పవన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్ అని వాదించడంతో..
కోర్టు ప్రభుత్వ న్యాయవాది వాదనతో ఏకీభవిస్తూ.. అసలు పిటిషన్‌కు విచారణ అర్హత లేదని చెబుతూ ఆ కేసుని హైకోర్టు కొట్టివేసింది.





గందరగోళంగా హైదరాబాద్ మహానగరం 

Loading..