ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం హైదరాబాద్ మహానగరం పై ఎఫెక్ట్ పడేలా చేసింది. అన్నిసిటీస్ లో ఇబ్బందులు ఉన్నా ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం మాత్రం గందరగోళంగా తయారైంది. ఓ పక్క గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డబుల్ సిలిండర్ ఉన్నవారు 35 రోజుల తర్వాత, ఉజ్వల కనెక్షన్ ఉన్నవారు 45 రోజుల తర్వాతే రీఫిల్ బుకింగ్‌కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
ఇక సింగిల్ సిలిండర్ ఉన్నవారికి మాత్రం 25 రోజులకే బుకింగ్ చేసుకునే అవకాశం, అలాగే గడువు తేదీకి ముందే బుక్ చేస్తే బుకింగ్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.. ఇది ఇలా ఉంటె ఇప్పుడు నగరంలో పెట్రోలు కొరత మొదలైంది. పెట్రోలు బంక్స్ ముందు క్యూ లో నిలబడి పెట్రోల్ కొట్టించుకోవడమే కాదు పెట్రోల్ బంక్స్ మూత పడడంతో నగరంలో చాలా చోట్లా జనజీవనం స్తంభించింది.
ఆటో లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పెట్రోల్ బంక్స్ ముందు కార్లు, బైక్స్ క్యూలో ఉన్నాయి. అయినా నో స్టాక్ బోర్డు లతో ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు.పెట్రోల్ కొరత లేదు అంటున్నా, పెట్రోల్ కొరత అనే వార్తల నడుమ ప్రజలు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించడానికి ఎగబడుతున్నారు. ఆయిల్ కంపెనీల తీరుతో తెలంగాణాలో పెట్రోల్ కొరత ఏర్పడింది.
క్యాష్ అండ్ క్యారితోనే పెట్రోల్ సప్లై చేస్తామని ఆయిల్ కంపెనీలు పట్టు బట్టడంతో ఈ పెట్రోల్ కొరత ఏర్పడి అనవసర గందరగోళానికి దారి తీసింది. నగరంలో పెట్రోల్ కొరత లేదు రూమర్స్ ని నమ్మొద్దు అని ఎంత చెబుతున్నాపెట్రోల్ బ్యాంకులు మూత తో ప్రజలు ఆందోళన వ్యక్త చేస్తున్నారు.





అఖిల్ మౌనం - కంగారులో అక్కినేని ఫ్యాన్స్ 

Loading..