ధురంధర్ ద రివెంజ్ చిత్రం సృష్టిస్తున్న విధ్వంశం చూసి పక్క దేశం పాకిస్తాన్ ఒణికిపోతుంది. ఎప్పుడు మనపై వెన్నుపోటు పొడిచేలా ఉగ్రదాడులను ప్రోత్సహించే పాకిస్తాన్ ఇప్పుడు ధురంధర్ సినిమా చూసి ఒణికిపోవడానికి కారణం.. ఇండియన్ ఏజెంట్స్ మారు వేషంలో ఎక్కడ పాకిస్తాన్ లో తిరుగుతూన్నారో అని భయపడిపోతున్నారు.
ధురంధర్ చిత్రంలో రణ్వీర్ సింగ్ ఇండియన్ ఏజెంట్ గా పాకిస్తాన్ కరాచీ, లియారీ లోని ఉగ్రమూకలను చాకచక్యంగా మట్టుబెట్టి, దేశభక్తిని చాటుకున్నాడు. ఇది రియల్ స్టోరీనే. రీల్ గా మార్చి ఆదిత్య ధర్ తెరకెక్కించారు. అలాంటి రా ఏజెంట్స్ ఇంకా పాకిస్తాన్ లో ఉన్నారేమో అనే అనుమానం అక్కడి పాకిస్తాన్ అధికారుల్లో మొదలైంది.
ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అని పాకిస్తాన్ క్రికెటర్స్ కూడా మాట్లాడుతున్నారు అంటే పాకిస్తానీయులు ఇండియన్ ఏజెంట్స్ ని చూసి ఎంతగా భయపెడుతున్నారో, ధురంధర్ చిత్రం పాకిస్తానీయులను ఏ విధంగా భయపెట్టిందో చూసి భారతీయులు నవ్వ్వుకుంటున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చి ఉగ్రవాదులుగా మారి ఇండియన్స్ ని క్రూరాతిక్రూరంగా చంపేసి ఎంచక్కా పాకిస్తాన్ కి చేక్కేస్తున్నారు.
కానీ ఇండియన్ రా ఏజెంట్స్ కూడా అక్కడి ప్రజలతో కలిసిపోయి పాకిస్తాన్ కి అక్కడి ఉగ్రమూకకి సవాల్ విసురుతున్నారు. ఏదైనా ధురంధర్ చిత్రం మాత్రం పాకిస్తాన్ కి వెన్నులో ఒణుకు పుట్టించి అనేది నిజం.





ఏపీ సీఎం తో సంజయ్ దత్ భేటీ 

Loading..