Advertisementt

ఏపీ సీఎం తో సంజయ్ దత్ భేటీ

Tue 24th Mar 2026 09:30 PM
chandrababu  ఏపీ సీఎం తో సంజయ్ దత్ భేటీ
Sanjay Dutt meets AP CM ఏపీ సీఎం తో సంజయ్ దత్ భేటీ
Advertisement
Ads by CJ

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈరోజు మంగళవారం అమరావతి వెళ్లి అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు ని కలవడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలోనూ బాలీవుడ్ నటులు కొంతమంది సీఎం చంద్రబాబు తో భేటీ అయ్యారు. ఇప్పుడు సంజయ్ దత్ చంద్రబాబు ని కలిసిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నేడు(మంగళవారం) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి వారిరువు ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆంధ్రలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్ ముఖ్యమంత్రి చంద్రబాబు కి వివరించారు. 

సినిమా షూటింగ్‌లకు ఏపీని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నాయని సీఎం కూడా సంజయ్ దత్ కి తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు-సంజయ్ దత్ ల భేటీ సినిమా వర్గాల్లో ఆసక్తిగా మారింది. 

Sanjay Dutt meets AP CM:

Sanjay Dutt meets AP CM Chandrababu

Tags:   CHANDRABABU
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ