Advertisementt

పీకే సినిమాపై తేల్చేసిన దేవ‌క‌ట్టా

Tue 24th Mar 2026 08:49 PM
deva katta   పీకే సినిమాపై తేల్చేసిన దేవ‌క‌ట్టా
Devakatta on Pawan పీకే సినిమాపై తేల్చేసిన దేవ‌క‌ట్టా
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 33వ చిత్రానికి దేవ‌క‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న వార్త‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే.  దేవ‌క‌ట్టా నాలెడ్జ్,  సెన్సిబిలిటీస్ న‌చ్చి ప‌వ‌న్ ఇస్తోన్న అవ‌కాశంగా తెలుస్తోంది. `ప్రస్థానం` వంటి క్లాసిక్ పొలిటికల్ డ్రామాను అందించిన దేవకట్టా పవన్ కళ్యాణ్‌లోని అసలైన రాజకీయ నాయకుడిని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదొక‌ సినిమాగానే కాకుండా? పవన్ కళ్యాణ్ నిజ జీవిత వ్యక్తిత్వానికి, ఆయన సిద్ధాంతాలకు అద్దం పట్టేలా ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ పవర్‌ఫుల్ అండ్ రియలిస్టిక్ పొలిటీషియన్‌గా కనిపించబోతున్నారని, ఆయనలోని నిజాయితీని , ప్రజా సేవ పట్ల ఉన్న నిబద్ధతను దేవకట్టా తనదైన శైలిలో చూపించనున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది.

సాధారణంగా పవన్ సినిమాల్లో ఉండే మాస్ ఎలిమెం ట్స్‌తో పాటు, ఈ ప్రాజెక్టులో లోతైన రాజకీయ విశ్లేషణలు , సమాజం పట్ల ఆయనకున్న విజన్ స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ నిజ జీవిత రాజకీయ ప్రస్థానానికి ఈ సినిమా ఒక ప్రతిరూపంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలో ఈ సినిమా  తెర‌పైకి రావ‌డం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్‌లో దాగి ఉన్న ఒక గొప్ప నాయకుడిని, ఆయన ఆశయాలను దేవకట్టా తన పదునైన డైలాగులతో , గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో బయటకు తీస్తాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Devakatta on Pawan :

Deva Katta clarifies Pawan Kalyan rumors, eyes non-political film

Tags:   DEVA KATTA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ