అప్పట్లో అంటే సంక్రాంతికి విడుదలైన రాజసాబ్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు మారుతి ని ఎంతగా టార్గెట్ చేసి టార్చర్ చేసారో అందరికి తెలుసు. సినిమా విడుదలకు ముందు మారుతి విషయంలో సైలెంట్ గానే ఉన్నా రాజసాబ్ విడుదలయ్యాక సినిమాకి వచ్చిన ఫీడ్ బ్యాక్ చూసాక మారుతిని ఆడుకున్నారు. రాజాసాబ్ కి నెగెటివ్ టాక్ వచ్చాక కూడా ప్రభాస్ ఫ్యాన్స్ మెచ్చుకున్నారు, ప్రభాస్ ఫోన్ చేసారు అంటూ మీడియా ముందు మాట్లాడాడు మారుతి.
ఆతర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్ దెబ్బకు సైలెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఇప్పుడు దర్శకుడు హారిష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ చూసి ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫోన్ చేసారు, మెచ్చుకున్నారని హరీష్ శంకర్ చెప్పాడు. ఉస్తాద్ బాత్ సింగ్ మరీ తీసేసే సినిమా కాదు, కానీ హరీష్ ముందునుంచి చెప్పినట్టుగా సినిమా లో కంటెంట్ లేదు.
వింటేజ్ పవన్ ని చూపించి ఫ్యాన్స్ ని పడేద్దామంటే కుదిరే పనేనా.. ఉస్తాద్ కి వస్తున్న ఫీడ్ బ్యాక్, రాంగ్ టైమ్ లో సినిమా విడుదల, హరీష్ శంకర్ చెప్పినట్టుగా ఉస్తాద్ హిట్ కాకపోవడంతో పవన్ ఫ్యాన్స్ కూడా హరీష్ శంకర్ పై గుర్రుగానే ఉన్నారు. ఆయన మాత్రం ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది అని చెప్పొకోవడం హాస్యాస్పదం అంటూ చాలామంది ఓపెన్ గానే మాట్లాడుతున్నారు.





బీసీ సెంటర్స్ కి పరిమితమైన ఉస్తాద్

Loading..