Advertisementt

చరణ్ బర్త్ డే కి అదిసరిపోతుందా పెద్ది

Tue 24th Mar 2026 12:02 PM
ram charan  చరణ్ బర్త్ డే కి అదిసరిపోతుందా పెద్ది
Peddi special teaser arriving చరణ్ బర్త్ డే కి అదిసరిపోతుందా పెద్ది
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే మరో రెండు రోజుల్లో రాబోతుంది. మార్చ్ 27 చెర్రీ బర్త్ డే. ఏప్రిల్ 30 న విడుదల కాబోతున్న పాన్ ఇండియా ఫిలిం పెద్ది నుంచి రామ్ చరణ్ బర్త్ డే కి మెగా ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ పెద్ది నుంచి కేవలం 40 సెకన్స్ టీజర్ రాబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఇప్పటివరకు ఫస్ట్ షాట్ చూసారు, ఫస్ట్ సింగిల్ చూసారు, సెకండ్ సాంగ్ చూసారు.. ఇప్పుడు యాక్షన్ తో కూడిన పెద్ది టీజర్ ని చూడబోతున్నారంటూ మాట్లాడుతున్నా రామ్ చరణ్ బర్త్ డే కి కేవలం 40 సెకన్స్ వీడియో సరిపోతుందా అనే నిరాశలో మెగా ఫ్యాన్స్ కనిపిస్తున్నారు. పెద్ది కంటెంట్ పై డౌట్ లేదు. కానీ ఇంకాస్త నిడివి ఉన్న టీజర్ కావాలి అదే అభిమానుల కోరిక. 

మరి బుచ్చిబాబు అభిమానుల కోరికను దృష్టిలో పెట్టుకుని టీజర్ కట్ చేస్తే బావుంటుంది. కాపోతే ఏప్రిల్ 30 నుంచి పెద్ది పోస్ట్ పోన్ అవుతుంది అనే ఊహాగానాలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మార్చ్ 27 నే సినిమాని వీక్షిద్దామనుకుంటే అది ఏప్రిల్ 30 కి వెళ్ళింది. కానీ ఇప్పుడు అది కూడా పోస్ట్ పోన్ అంటే కష్టమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Peddi special teaser arriving:

Ram Charan Birthday special teaser arriving

Tags:   RAM CHARAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ