Advertisementt

బీసీ సెంటర్స్ కి పరిమితమైన ఉస్తాద్

Tue 24th Mar 2026 10:22 AM
pawan kalyan  బీసీ సెంటర్స్ కి పరిమితమైన ఉస్తాద్
Ustaad Bhagat Singh బీసీ సెంటర్స్ కి పరిమితమైన ఉస్తాద్
Advertisement
Ads by CJ

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ రాంగ్ టైమ్ లో దిగి లాంగ్ రన్ లో అవస్థలు పడుతుంది. మార్చ్ 19 ఉగాది రోజున హిందీ మూవీ ధురంధర్ ద రివెంజ్ చిత్రం తో పోటీ పడిన ఉస్తాద్ భగత్ సింగ్ కి లాంగ్ వీకెండ్ కలిసొచ్చినా.. యావరేజ్ టాక్ సోమవారినికే తేడా కొట్టింది.

ఆదివారం వరకు థియేటర్స్ లో ముఖ్యంగా మల్టిప్లెక్స్, బీసీ సెంటర్స్ ఆడియన్స్ ఉస్తాద్ ని చేసేందుకు ఉత్సాహం చూపించారు. కానీ సోమవారం నుంచి మల్టిప్లెక్స్ లో ఉస్తాద్ ని చూసే ఆడియన్స్ కరువయ్యారు. కేవలం బీసీ సెంటర్స్ లోనే ఉస్తాద్ ని చూసేందుకు ఆడియన్స్ మొగ్గు చూపుతున్నారు.

సోమవారం, మంగళవారం ఇలా ఉస్తాద్ థియేటర్స్ లో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. కాస్తో కూస్తో బీసీ సెంటర్స్ ఆడియన్స్, పవన్ ఫ్యాన్స్ తప్ప మిగతా ఆడియన్స్ ఉస్తాద్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూయించడం లేదు. మరి లాంగ్ రన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి దేవుడికెరుక. 

Ustaad Bhagat Singh:

Ustaad Bhagat Singh - Pawan Kalyan

Tags:   PAWAN KALYAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ