Advertisementt

క్రేజ్ అంతా అల్లు సినిమాస్ దే

Tue 24th Mar 2026 08:49 AM
allu cinemas  క్రేజ్ అంతా అల్లు సినిమాస్ దే
Allu Cinemas క్రేజ్ అంతా అల్లు సినిమాస్ దే
Advertisement
Ads by CJ

హైదరాబాద్ లో ఎలాంటి మల్టిప్లెక్స్ వెలిసినా ప్రేక్షకులు దానిలో సినిమా చూసేందుకు క్యూ కడతారు. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఉవ్విళ్లూరుతారు. గతంలో IMAX వచ్చినప్పుడున్న అదే క్రేజ్ ఇప్పటికి ప్రేక్షకుల్లో ఉంది. IMAX లో సినిమా చూడాలని చాలామంది అనుకుంటారు, చూస్తారు. ఆతర్వాత మహేష్ AMB వచ్చింది .

కొండాపూర్ లో వెలసిన ఈ AMB మాల్ లో ఉన్న మల్టిప్లెక్స్ థియేటర్ లో సినిమా చూసేందుకు నగరం నలుమూలల నుంచి ప్రేక్షకులు వస్తున్నారు. ఆతర్వాత AAA. ఇప్పుడు వీటన్నిటికీ మించి కోకాపేట లో వెలిసిన అల్లు సినిమాస్ కి ఉన్న క్రేజ్ మాటల్లో వర్ణించడం కూడా కష్టమే. 

అద్భుతమైన టెక్నాలజీతో, విశాలమైన స్క్రీన్లతో అల్లు సినిమాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ధురంధర్ 2 అక్కడ రోజుకి రెండు షోస్ పడుతున్నాయి. నగరంలోని మల్టిప్లెక్స్ ల కన్నా ముందే అల్లు సినిమాస్ లో టికెట్స్ బుక్ అవుతున్నాయి. కోకాపేట ఏరియాల నుంచే కాదు నగరంలోని పలు ప్రాంతాల వారు అల్లు సినిమాస్ ని ఎక్స్పీరియన్స్ చేసేందుకు వస్తున్నారు.

అల్లు సినిమాస్ డాల్బీ మ్యూజిక్ ని ఎంజాయ్ చేసేందుకు ఆడియన్స్ మొగ్గు చూపడమే కాకుండా.. అసలు అల్లు సినిమాస్ ఎలా ఉంది, స్క్రీన్ ఎలా ఉంది, సినిమా చూస్తుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే విషయంపై ప్రేక్షకులు తెగ ఇంట్రెస్ చూపిస్తున్నారు.

Allu Cinemas:

Allu Cinemas - Kokapet

Tags:   ALLU CINEMAS
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ