ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత గాథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బయోపిక్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రోహిత్ పాత్రను టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ పోషించబోతున్నారనే వార్తలు సినీ, క్రీడా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా శర్వానంద్ కొత్త సినిమా `బైకర్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో శర్వానంద్ ఈ విషయంపై స్పందించడం విశేషం.
రోహిత్ శర్మ బయోపిక్ గురించి స్పందిస్తూ `ప్రస్తుతానికి అధికారికంగా నా వద్దకు ఎలాంటి సమాచారం రాలేదు. కానీ నా పేరు వినిపిస్తున్నట్లు వార్తలు చూస్తున్నాను. రోహిత్ శర్మ జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. ఒకవేళ ఆ అవకాశం వస్తే తప్పకుండా ఆలోచిస్తాను` అన్నాడు. రోహిత్ శర్మ ఫిజిక్ ,లుక్‌కు శర్వానంద్ దగ్గరగా ఉండటంతో, ఆయన పాత్రకు సరిగ్గా సరిపోతారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదే ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాజశేఖర్ సరదాగా జోక్యం చేసుకుంటూ `శర్వానంద్ రోహిత్ శర్మ అయితే, నేను ధోనీ అవుతా అని వ్యాఖ్యానించడం అక్కడ నవ్వులు పూయించింది.
రోహిత్ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. సాధారణ మధ్యతరగతి నుంచి వచ్చి అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు , అత్యధిక సిక్సర్ల వంటి అసాధారణ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. రోహిత్ ప్రయాణం వెండితెరపై ఆవిష్కృతమైతే అది మరో ఎంఎస్ ధోనీ స్థాయి విజయాన్ని అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సచిన్, కపిల్ దేవ్ వంటి దిగ్గజాల బయోపిక్‌లు అలరించగా ఇప్పుడు హిట్‌మ్యాన్ వంతు వచ్చింది.




జగన్ మహానుభావుడు - కొడాలి 

Loading..