Advertisementt

జగన్ మహానుభావుడు - కొడాలి

Mon 23rd Mar 2026 01:11 PM
kodali nani  జగన్ మహానుభావుడు - కొడాలి
Kodali Nani about YS Jagan జగన్ మహానుభావుడు - కొడాలి
Advertisement
Ads by CJ

ఏడాది కాలంగా రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న కొడాలి నాని మళ్లీ యాక్టీవ్ అవుతున్నాడు. హెల్త్ ప్రోబ్లెంస్, అలాగే కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అన్న భయం తో కొడాలి నాని రాజకీయాల విషయంలో కామ్ గా కనిపించేలా చేసింది. ఇప్పుడు మళ్లీ యాక్టీవ్ అవుతున్నాడు. 2024 లో జగన్ ని ఎందుకు ఓడించామా అని ఏపీ ప్రజలు బాధపడిపోతున్నారు, ఇప్పుడు వారికీ జగన్ లేని లోటు తెలుస్తుంది..

2029 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదు, జగన్‌ను ఎదుర్కోవడానికి చెల్లెళ్లను రోడ్డుపైకి తీసుకొచ్చి అనవసరమైన నిందలు మోపుతున్నారు. మాములుగా తండ్రి ఆస్తిలో వాటాలు ఇచ్చేవారిని చూసాం.. కానీ తన సొంత ఆస్తిలో కూడా చెల్లెలు వాటాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్‌, అంతటి మహానుభావుడు జగన్. ఇప్పటివరకు ఎక్కడా జగన్ తన చెల్లెళ్ల గురించి తప్పుగా మాట్లాడలేదు, కానీ వారు మాత్రం చెప్పుడుమాటలు విని జగన్ గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు.

చంద్రబాబు దొంగ హామీల వల్లే జగన్ ఓడిపోయారు, 2024లో జగన్‌ను ఓడించడానికి దొంగలంతా కలిశారు, జగన్ కంటే ఎక్కువ హామీలు అంటూ సూపర్ సిక్స్ పేరు చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది, కానీ ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చలేకపోతుంది అంటూ కొడాలి నాని జగన్ మహానుభావుడు, చంద్రబాబు రాక్షసుడు అంటూ మీడియా ముందు రెచ్చిపోయాడు. 

Kodali Nani about YS Jagan:

Kodali Nani made a strong statement

Tags:   KODALI NANI
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ