రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 మార్చ్ 19 న విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు కొల్లగొట్టి న ధురంధర్ 2 చిత్రంపై రణ్వీర్ సింగ్ భార్య దీపికా పదుకొనే ట్వీట్ వెయ్యకపోవడంపై మీడియాలో రకరాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఆమె చాలా బిజీ హీరోయిన్, అలాగే ఓ తల్లి.
కానీ దీపికా పదుకొనె భర్త రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ చిత్రం పై ట్వీట్ వెయ్యలేదు, కారణం వారి మద్యన విభేదాలు తలెత్తాయంటూ వార్తలు వండి వార్చారు. ఆమె ఎంత బిజీగా వున్నా ఓ ట్వీట్ వెయ్యాల్సింది అనేది వీళ్ల వాదన. దీపికా ధురంధర్ 2 ని పొగడకపోతే రన్వీర్ కి దీపికా కి మద్యన గొడవలేమైనా జరిగినట్టేనా.. ఇదేనా మీడియా మాట్లాడేది అని వారి వారి అభిమానులు ఫైర్ అయ్యారు.
ఇక తాజాగా ధురంధర్ 2సక్సెస్ తర్వాత రణ్వీర్ భార్య దీపికా పదుకోన్ తో కలిసి సంతోషం గా వున్న సెల్ఫీ పిక్స్ షేర్ చేసారు. ఓ రెస్టారెంట్ లో రణ్వీర్, దీపికా లతో పాటుగా అక్కడి స్టాఫ్ తో కలిసి దిగిన సెల్ఫీ చూసిన నెటిజెన్స్ ఈ పిక్ తో అందరి సందేహాలకు దీపికా సమాధానమిచ్చింది. ఇది సరిపోతుందా.. ఇంకేమైనా ప్రూఫ్ కావాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.





శర్వానంద్ రోహిత్ శర్మ అయితే నేను ధోనీ

Loading..