Advertisementt

మండే - ఉస్తాద్ పరిస్థితి ఇది

Mon 23rd Mar 2026 10:47 AM
ustaad bhagat singh  మండే - ఉస్తాద్ పరిస్థితి ఇది
Ustaad Bhagat Singh Monday test begins మండే - ఉస్తాద్ పరిస్థితి ఇది
Advertisement
Ads by CJ

మార్చ్ 19 ఉగాది స్పెషల్ గా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి జస్ట్ యావరేజ్ టాక్ వచ్చింది. అభిమానులకే కాదు పవన్ కళ్యాణ్ వింటేజ్ స్టయిల్ యూత్ కి, కామన్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. పవన్ లుక్స్ విషయంలో ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఉస్తాద్ కంటెంట్ ని ఎంజాయ్ చేయలేకపోయారు.

గత నాలుగు రోజులుగా ధురంధర్ 2 తాకిడి తట్టుకుని నిలబడిన ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు సోమవారం టెస్ట్ కి రెడీ అయ్యింది. అయితే బుక్ మై షో ఓపెన్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ షాకిస్తున్నాయి. ప్రతి థియేటర్ లోను ఖాళీ సీట్లు దర్శనమిస్తున్నాయి. టికెట్స్ తెగడం లేదు. సోమవారం ఉదయం 10 గంటల షోస్ నుంచి మిడ్ నైట్ షోస్ వరకు ఉస్తాద్ కి టికెట్స్ కావాలంటే ఫ్రీ అన్నట్టుగా ఉంది.

సోమవారం డే ఎలా ఉన్నా నైట్ షోస్ ఫుల్ అవుతాయని పవన్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలోనే థియేటర్స్ అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈరోజు మండే కనీసం 40 శాతం ఆక్యుపెన్సీ ఉంటుందా అనేది డౌట్ అంటున్నారు ట్రేడ్ నిపుణులు. చూద్దాం ఈరోజు గడిచేసరికి ఉస్తాద్ పొజిషన్ ఏమిటి అనేది.

Ustaad Bhagat Singh Monday test begins:

Ustaad Bhagat Singh

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ