Advertisementt

అత్త‌ని హ‌డ‌లెత్తించే కొడ‌లిగా

Mon 23rd Mar 2026 09:58 AM
yami gautam  అత్త‌ని హ‌డ‌లెత్తించే కొడ‌లిగా
Yami Gautam - Nayyi Navelli అత్త‌ని హ‌డ‌లెత్తించే కొడ‌లిగా
Advertisement
Ads by CJ

బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ యామీ గౌతమ్  `నయ్యీ నవేలీ` అనే ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో అమ్మ‌డు కొత్త కోడలి పాత్రలో కనిపిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇది కేవలం ఒక సాధారణ ఫ్యామిలీ డ్రామా మాత్రమే కాదు. ఇందులో యామీ పాత్ర చుట్టూ ఓ  మిస్టరీ దాగి ఉందని సినిమా ప్రచార చిత్రాలను బట్టి అర్థమవుతోంది. అత్తను హడలెత్తించే కోడలిగా ఆమె నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది.

ఈ కథలో యామీ గౌతమ్ అత్తింటి పాలిట ఒక ఆదర్శవంతమైన కోడలా? లేక వారిని ముప్పుతిప్పలు పెట్టే ఒక దుష్టశక్తిగా మారబోతోందా? అనే సస్పెన్స్ ప్రేక్షకులలో కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. కుటుంబ విలువల మధ్య సాగే ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాను కొత్త పుంతలు తొక్కించనున్నాయి. యామీ తన సహజ సిద్ధమైన నటనతో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఎలా పండించిందో? చూడాలని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

`నయ్యీ నవేలీ` చిత్రం అత్తా-కోడళ్ళ మధ్య సాగే ఒక విభిన్నమైన పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరించనుంది. సంప్రదాయబద్ధంగా కనిపించే ఒక కొత్త కోడలు- తన తెలివితేటలతో లేదా ఏదైనా రహస్య ఉద్దేశంతో అత్తింటిని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఈ చిత్రంలో చూడాలి. ఇప్ప‌టివ‌ర‌కూ యామీ గౌతమ్  విభిన్నమైన పాత్రలు చేసి మెప్పించారు.  ఈ కొత్త కోడలి అవతారంలో ఆమె మరెంతగా భయపెడుతుందో? తెలియాలంటే సినిమా విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.

Yami Gautam - Nayyi Navelli:

Yami Gautam To Lead Horror Comedy Nayyi Navelli

Tags:   YAMI GAUTAM
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ