ధురంధర్ 2 ఇప్పుడు ఎవరి నోట విన్నా అదే మాట. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ వరకు అందరినోట ధురంధర్ మాటే. అంతలా ఆడియన్స్ ను ధురంధర్ చిత్రం మాయ చేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా, మాధవన్, అర్జున్ రామ్ పాల్, సంజయ్ దత్ లు కీ రోల్స్ లో కనిపించిన ఈ చిత్రం పార్ట్ వన్ కన్నా ఎక్కువగా ద రివెంజ్ పార్ట్ 2 మరింతగా బ్లాక్ బస్టర్ అయ్యింది.
నార్త్ లో మార్చ్ 19 న విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో మాత్రం ఆ రోజు రిలీజ్ అవ్వలేదు. తెలుగు, తమిళ, కన్నడ లో ధురంధర్ 2 చిత్రం అనుకున్న సమయానికి అందుబాటులోకి రాలేదు, రెండు రోజుల తర్వాత ధురంధర్ 2 తెలుగు ఆడియన్స్ ముందుకు రాగా.. ఆ చిత్రాన్ని వీక్షించిన తెలుగు ఆడియన్స్ ధురంధర్ 2 ఆహా, ఓహో అన్నా వారికి ఆ చిత్రం పై ఓ కంప్లైంట్ ఉంది.
అది ధురంధర్ 2 తెలుగు డబ్బింగ్. తెలుగు డబ్బింగ్ క్వాలిటీపై తెలుగు ఆడియన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రణ్వీర్ కేరెక్టర్ కి చెప్పిన డబ్బింగ్ వాయిస్ సెట్ కాలేదని, వాయిస్ టోన్‌లో స్పష్టత లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరి ఎన్నో అంచనాలున్న, ఎంతో క్రేజ్ ఉన్న ధురంధర్ 2 విషయంలో తెలుగు ఆడియన్స్ ఈ డబ్బింగ్ పై కంప్లీట్ చేస్తున్నారు.
మరి పాన్ ఇండియా భాషలకు ఈ డబ్బింగ్ అనేది కీలకం. కానీ మేకర్స్ దానినే లైట్ తీసుకోవడం ఏమిటో.. బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 కి ఇది మైనస్ అయ్యింది.




మండే - ఉస్తాద్ పరిస్థితి ఇది 

Loading..