Advertisementt

విడాకులపై మెగా డాటర్ వెర్షన్

Sat 21st Mar 2026 07:58 PM
niharika  విడాకులపై మెగా డాటర్ వెర్షన్
Mega Daughter version on divorce విడాకులపై మెగా డాటర్ వెర్షన్
Advertisement
Ads by CJ

మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సింగిల్ స్టేటస్ ని మైంటైన్ చేస్తుంది. పెద్దలు కుదిర్చిన చైతన్య జొన్నలగడ్డ ని వివాహామాడిన నిహారిక ఆతర్వాత చైతన్య తో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆతర్వాత నిహారిక నిర్మాతగా బిజీ అయ్యింది. ప్రస్తుతం రాకాస చిత్రంతో ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిహారిక ఆ చిత్ర ఇంటర్వూస్ లో మొదటిసారి విడాకుల విషయం మాట్లాడింది.

తను చైతన్య తో విడిపోదామని అనుకున్నప్పుడు ముందుగా తండ్రికి చెప్పినట్టుగా నిహారిక చెప్పుకొచ్చింది. నాగబాబు తో తను విడిపోతున్న విషయం చెప్పి, జరిగింది చెప్పినట్టుగా మౌనం గా విని మాట్లాడలేదు అని.. తను వివాహ బంధంలో సంతోషంగా లేను అని, సంతోషం లేని బంధంలో ఉండాల్సిన అవసరం లేదు అని నాన్నే సలహా ఇచ్చారు.  

తమ మద్యన అపార్దాలు వచ్చినా అవి సరి చేసుకునే అవకాశం లేకపోవడం వల్లే తను విడిపోయాను అని, కొట్టుకుని, తిట్టుకుని విడిపోతే విడాకులు విషయంలో బాధ ఉండేది కాదు, కానీ అలా విడిపోవడం చాలా బాధను మిగులుస్తుంది అని చెప్పింది. ఇక మాజీ భర్త ఛైతన్య తో టచ్ లో లేదు విడిపోయాక మళ్లీ కలవలేదు అంటూ నిహారిక మొదటిసారి విడాకుల విషయంలో తన వెర్షన్ వినిపించింది. 

Mega Daughter version on divorce:

Niharika Konidela on Divorce with Chaitanya

Tags:   NIHARIKA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ