పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్, బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 చిత్రాలు ఒకేరోజు మార్చ్ 19 న ప్రేక్షకుల ముందు వచ్చాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ విషయంలో డిప్యూటీ సీఎం హోదాలో సానుకూలంగా ఉండే పవన్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ పై ట్వీట్ వెయ్యకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ ధురంధర్ చూసి ఆహా, ఓహో అంటూ ట్వీట్లు వేస్తున్న సినీప్రముఖులు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మౌనం గా ఉండడాన్ని చాలామంది భరించలేకపోతున్నారు. ఏ ధురంధర్ 2 ని పొగిడితే మీకు హిందీ మార్కెట్ వర్కౌట్ అవుతుంది అనా.. అందుకే ధురంధర్ ని ఆకాశానికెత్తేస్తున్నారు.
అదే ఉస్తాద్ భగత్ సింగ్ పై ఓ ట్వీట్ వేస్తె మీ సొమ్మేం పోదుగా.. టాలీవుడ్ ప్రముఖులే మన ఇండస్ట్రీని అవమానించే పనులు చేస్తే ఎలా, మన హీరో సినిమా గురించి మనం మాట్లాడుకోకపోతే ఎలా అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చెయ్యడం హైలెట్ అవుతుంది. మీకు ఉస్తాద్ కన్నా ధురంధర్ 2 ఎక్కువైందా అంటున్నారు.
మిమ్మల్ని ప్లాప్ సినిమాపై ట్వీట్ వెయ్యమని ఎవరూ అడగలేదు. సినిమా విడుదల అవ్వకుముందు విషెస్ చెప్పొచ్చుగా అయినా సినిమా బావుంది, వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూసి తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ కి పవన్ కి విషెస్ చెబితే బావుంటుంది అనేది పలువురి అభిప్రాయం.





ఈ వారం ఓటీటీ రిలీజులు 

Loading..