Advertisementt

తమన్నా క్యాలెండర్‌లో సౌత్ మాయం!

Sat 21st Mar 2026 08:27 PM
tamanna  తమన్నా క్యాలెండర్‌లో సౌత్ మాయం!
Tamanna తమన్నా క్యాలెండర్‌లో సౌత్ మాయం!
Advertisement
Ads by CJ

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ప్లానింగ్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దశాబ్ద కాలానికి పైగా దక్షిణాదిలో అగ్ర హీరోయిన్‌గా వెలిగిన ఈ భామ, 2026లో మాత్రం పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితం కాబోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ దాదాపు హిందీ చిత్రాలే కావడం విశేషం. షాహిద్ కపూర్‌తో `ఓరోమియో`, సిద్ధార్థ్ మల్హోత్రాతో `వాన్`, అలాగే అజయ్ దేవగన్, సంజయ్ దత్ వంటి స్టార్ల సరసన `రేంజ‌ర్` వంటి భారీ చిత్రాలతో తమన్నా డైరీ ఫుల్ అయిపోయింది. దీంతో ఈ ఏడాదిని ఆమె తన హిందీ ఇయర్ గా  మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేసే తమన్నా, ఇప్పుడు సౌత్ సినిమాలకు గ్యాప్ ఇవ్వడం వెనుక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ చేసిన చివరి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం ఒకటైతే, బాలీవుడ్ మేకర్స్ ఆమెలోని నటిని కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ విభిన్నమైన పాత్రలు ఆఫర్ చేయడం మరో కారణం. కేవలం వెండితెరపైనే కాకుండా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ హిందీ వెబ్ సిరీస్‌లతో తమన్నా బిజీగా ఉంది. అక్కడ లభిస్తున్న భారీ రెమ్యునరేషన్, ప్రాధాన్యత ఉన్న పాత్రల కారణంగానే ఆమె ముంబై వైపు మొగ్గు చూపుతోంది.

అయితే తమన్నా పూర్తిగా దక్షిణాది సినిమాలకు దూరమైందని చెప్పలేం. తన కెరీర్‌కు పునాది వేసిన టాలీవుడ్, కోలీవుడ్ అంటే ఆమెకు ఎప్పుడూ ప్రత్యేక గౌరవమే. సరైన కథ, పవర్‌ఫుల్ పాత్ర లభిస్తే మళ్లీ సౌత్ సినిమాల్లో మెరవడానికి ఆమె సిద్ధంగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టుల వల్ల డేట్లు సర్దుబాటు కాకపోయినా, భవిష్యత్తులో మళ్లీ ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించే అవకాశం ఉంది. మొత్తానికి 2026లో తమన్నా బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలుగుతూ, తన కెరీర్‌ను ఆసక్తికరమైన మలుపు తిప్పుకుంటోందని చెప్పొచ్చు.

Tamanna :

Tamanna Busy In Bollywood

Tags:   TAMANNA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ