Advertisementt

అయ్యయ్యో అల్లు అర్జున్ మిస్ అయ్యాడే..

Sun 15th Mar 2026 11:15 AM
allu arjun  అయ్యయ్యో అల్లు అర్జున్ మిస్ అయ్యాడే..
AP Chief Minister visits Allu house అయ్యయ్యో అల్లు అర్జున్ మిస్ అయ్యాడే..
Advertisement
Ads by CJ

రీసెంట్ గానే అల్లు వారింట అల్లు శిరీష్ వివాహం, దానికి సంబందించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అల్లు శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్ దగ్గర నుంచి, ప్రీ వెడ్డింగ్ పార్టీ, మెహిందీ, సంగీత్, ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్, అలాగే పెళ్లి వేడుకలు అన్నిటిని అల్లు అర్జున్ దగ్గరుండి చూసుకున్నాడు. ఆ విషయమే శిరీష్ చెబుతూ అందరికన్నా ముందే ఫంక్షన్ కి వచ్చి అన్ని దగ్గరుండి చూసుకుంటూ అందరికన్నా చివరిలో అన్నయ్య అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళేవాడు అని చెప్పాడు.

తమ్ముడి పెళ్లి లో అన్ని తానై సీఎం రేవంత్ రెడ్డి ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని దగ్గరుండి ఆహ్వానించిన అల్లు అర్జున్ ఇప్పుడు తన ఇంటికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన సమయంలో మిస్ అవడం ఆయన ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. అల్లు శిరీష్ పెళ్ళికి రావాలని అల్లు అరవింద్ సీఎం చంద్రబాబు ని ఆహ్వానించారు.

కానీ పనుల ఒత్తిడి తో చంద్రబాబు అల్లు శిరీష్ పెళ్ళికి వెళ్లలేకపోయారు. దానితో ఆయన నిన్న శనివారం సాయంత్రం అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కొత్తపెళ్ళికొడుకు శిరీష్ ఆయన భార్య నయనికా ని ఆశీర్వదించి అల్లు అరవింద్ ఫ్యామిలీతో కాసేపు గడిపి వచ్చారు. ఈ పర్టిక్యులర్ సమాయంలో అల్లు అర్జున్ ఈ స్పెషల్ అకేషన్ ని మిస్ అయ్యారు. ఆయన ప్రస్తుతం అట్లీ తో చేస్తున్న AA 22 కోసం భార్య స్నేహ తో కలిసి ముంబైగా లో ఉన్నారు.

AP Chief Minister visits Allu house :

AP CM Chandrababu Naidu visited Allu Aravind residence on Saturday

Tags:   ALLU ARJUN
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ