ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంతో వెండితెరకు పరిచయమవుతున్న నటి మోనాలిసా భోంస్లే వివాహం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారం రేపుతోంది. ఆమె ఇటీవలే ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని కేరళలో వివాహం చేసుకోగా, ఈ పెళ్లిపై దర్శకుడు సనోజ్ మిశ్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. మోనాలిసా అసలు వయసుపై తనకు అనుమానాలు ఉన్నాయని, ఆమె ఇంకా మైనర్ అయ్యే అవకాశం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మహాకుంభ్ సమయంలో ఆమె వయసు కేవలం 16 ఏళ్లేనని, పెళ్లి కోసం వయసు పత్రాలను తారుమారు చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదం కేవలం వయసుకే పరిమితం కాకుండా, సినిమా ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రగా దర్శకుడు అభివర్ణించారు. మోనాలిసా తన సినిమాలో నటించకుండా అడ్డుకోవడానికే కొన్ని శక్తులు ప్రణాళికాబద్ధంగా ఈ వివాహాన్ని జరిపించాయని సనోజ్ మిశ్రా ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆమె అసలు వయసును నిర్ధారించేందుకు మెడికల్ పరీక్షలు జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనిపై క్లారిటీ కోసం తాను మహేశ్వర్ వెళ్లి ఆమె కుటుంబాన్ని స్వయంగా కలుస్తానని, చట్టపరంగా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ వైద్య పరీక్షల్లో మోనాలిసా మైనర్ అని తేలితే, ఆమె భర్త ఫర్మాన్‌తో పాటు ఈ పెళ్లి జరిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. అయితే, మోనాలిసా కుటుంబ సభ్యులు , పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే ఆమెకు 18 ఏళ్లు నిండాయని, ఆమె మేజర్ అని వారు వాదిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ఈ వయసు వివాదం చివరికి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.




అయ్యయ్యో అల్లు అర్జున్ మిస్ అయ్యాడే.. 

Loading..