ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ తెలుగు ఆడియన్స్ లో ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనే చెప్పాలి. నిన్న శనివారం విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్లో పవన్ నోటి వెంట వచ్చిన ప్రతి డైలాగ్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. వైలెన్స్ అంటే మీనింగ్ తెలియని మీ అందరికి ఓ ఫ్యాషనైపోయింది.. చూపిస్తా.. అర్ధం, భావం, అవసరం అన్ని చూపిస్తా..
మా బాస్ పక్కనుంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉండదు అని ఉస్తాద్( పవన్) కి ఎక్కువ బిల్డప్ ఇవ్వగానే.. రెడ్డి గారు ఈ బిల్డప్పులే.. కొంచెం ఆ ప్రాస కోసం ప్రాణం మీదకు తెచ్చుకొకండి.. చూస్తున్నారుగా, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం డాన్స్, సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చెయ్యడం.. మన జీవితాలకు ఎవరెవరో లైక్ లు కొట్టడం కాదు. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్.. ఇచ్చి పడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం, ఈసారి పెరఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ పవన్ నోట పలికిన డైలాగ్స్ అన్నీ ట్రైలర్ లో హైలెట్ అయ్యాయి.
ఈ ట్రైలర్ లోని డైలాగ్స్ సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేసాయి. మార్చ్ 19 న థియేటర్స్ లోకి దిగుతున్న ఉస్తాద్ పై ట్రైలర్ అంచనాలు క్రియేట్ చేసింది. మరి ఈ డైలాగ్ చాలుగా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి.. అన్నట్టు ఈ డైలాగ్స్ క్రెడిట్ హరిష్ కి ఇవ్వాలా, త్రివిక్రం కి ఇవ్వాలా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలయ్యింది.




మృణాల్ రాయల్ లుక్ 

Loading..