Advertisementt

త్వరగా బైక్ స్టార్ట్ చెయ్యి శర్వా

Sat 14th Mar 2026 09:54 AM
biker  త్వరగా బైక్  స్టార్ట్ చెయ్యి శర్వా
Biker Promotions త్వరగా బైక్ స్టార్ట్ చెయ్యి శర్వా
Advertisement
Ads by CJ

నారి నారి నడుమ మురారి సినిమా తో హిట్ ట్రాక్ ఎక్కిన కుర్ర హీరో శర్వానంద్ ఇప్పుడు బైకర్ తో రాబోతున్నాడు. నారి నారి విడుదలై మూడు నెలలు తిరక్కముందే బైకర్ చిత్రాన్ని దించుతున్నాడు. ఎప్పుడో డిసెంబర్ లో విడుదల కావాల్సిన బైకర్ చిత్రాన్ని ఏప్రిల్ 3 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. 

మరి ఈమధ్యన కుర్ర హీరోల ప్రమోషన్స్ ఎలా ఉంటున్నాయి, సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారో చూస్తున్నాం. అప్పుడు నారి నారి నడుమ మురారిని కూడా శర్వా అండ్ మేకర్స్ సడన్ గా సంక్రాంతి రిలీజ్ అని ఒక ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేసారు. అందుకే సినిమా హిట్ అయినా కలెక్షన్స్ రాలేదు.

ఇప్పుడు బైకర్ పై మంచి క్రేజ్ ఉంది, అందుకు తగ్గ ప్రమోషన్స్ అందిస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అందుకే అనేది త్వరగా బైకర్ ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యి శర్వా అనేది. మరి దర్శకనిర్మాతలు ఎలా ఉన్నా శర్వానంద్ తన హీరోయిన్ ని వెంటేసుకుని గ్రౌండ్ లోకి దిగితే బైకర్ ఈజీగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. 

Biker Promotions:

Sharwanand Biker movie

Tags:   BIKER
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ