Advertisementt

ఉస్తాద్ పై సోషల్ మీడియా నెగిటివిటి

Sat 14th Mar 2026 09:04 AM
ustaad bhagat sing  ఉస్తాద్ పై సోషల్ మీడియా నెగిటివిటి
Social media negativity towards Ustaad ఉస్తాద్ పై సోషల్ మీడియా నెగిటివిటి
Advertisement
Ads by CJ

మార్చ్ 19 న రాబోతున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పై కొంతమంది పనిగట్టుకుని విషం చిమ్ముతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి ఈరోజు సాయంత్రం ట్రైలర్ రాబోతుంది.. ఉస్తాద్ లో ఊపు లేదు, ట్రైలర్ వస్తేనే అంటూ కొంతమంది కావాలని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడిని పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు. 

హరిష్ శంకర్ గత సినిమా అట్టర్ ప్లాప్.. మరి ఉస్తాద్ పై ఎలా నమ్మకమొస్తుంది, ఉస్తాద్ భగత్ సింగ్ లో ఊపు లేదు, పైగా ఇది మాస్ సినిమా.. హరి హర వీర మల్లు కి ఉన్న ఊపు కూడా ఉస్తాద్ కి కనిపించడం లేదు, సైనిక్స్ ఏమై పోయారు. దర్శకుడు హరీష్ శంకర్ సైడ్, ప్రొడక్షన్ సైడ్ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా నే చేస్తున్నారు.. కానీ సినిమాకే ఊపు రావటం లేదు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ పై బ్లూ మీడియా, వైసిపి నేతలు నెగెటివ్ ప్రాపగాండా ను నడిపిస్తున్నారు. బ్లూ మీడియా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ని నెగిటివ్ చెయ్యాలని కంకణం కట్టుకుంది. ఉస్తాద్ సాంగ్స్ వస్తున్నాయి కానీ ఉస్తాద్ లో వైరల్ లేదు, ఇక ట్రైలర్ వంతు అంటూ వ్యంగ్యంగా వార్తలు వండి వారుస్తున్నారు.

మరి ఈ నెగిటివిటీ ని దాటుకుని ఉస్తాద్ భగత్ సింగ్ ని హిట్ చేసే బాధ్యత పవన్ ఫ్యాన్స్ పైనే ఉంది. సైనిక్స్ ఇక దిగండి రంగంలోకి. 

Social media negativity towards Ustaad:

Ustaad Bhagat Sing

Tags:   USTAAD BHAGAT SING
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ