Advertisementt

చరణ్ వర్సెస్ బ‌న్నీ: ఎవ‌రు ముందంజ‌లో

Sat 14th Mar 2026 10:16 AM
ram charan  చరణ్ వర్సెస్ బ‌న్నీ: ఎవ‌రు ముందంజ‌లో
Ram charan Vs Allu Arjun చరణ్ వర్సెస్ బ‌న్నీ: ఎవ‌రు ముందంజ‌లో
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఇద్దరు అగ్ర హీరోలు రామ్ చరణ్  అల్లు అర్జున్.  ప్రస్తుతం ఇద్ద‌రు పాన్-ఇండియా స్టార్ హోదాను దాటి గ్లోబల్ స్టార్స్‌గా ఎదిగే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. చరణ్  `ఆర్ ఆర్ ఆర్` తో  ఆస్కార్ వేదిక వరకు వెళ్తే, బన్నీ `పుష్ప`తో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. అయితే వచ్చే ఐదు నుండి పదేళ్ల కాలంలో వీరిలో ఎవరు అతిపెద్ద స్టార్‌గా అవతరించే అవ‌కాశం ఉందంటే?రామ్ చరణ్ బలం ఆయన ఎంచుకుంటున్న అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులు, మేకింగ్ స్టైల్.  `ఆర్ ఆర్ ఆర్` తర్వాత చ‌ర‌ణ్ కు గ్లోబల్ లెవల్‌లో వచ్చిన గుర్తింపు సామాన్యమైంది కాదు. త్వ‌ర‌లో `పెద్ది` చిత్రంతో అల‌రించ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాపై పాన్ ఇండియాలో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అలాగే సుకుమార్‌తో చేయబోయే సినిమా చరణ్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేయనున్నాయి.

ముఖ్యంగా క్లాస్ ,మాస్ ప్రేక్షకులను సమానంగా మెప్పించగలగడం. విదేశీ మార్కెట్‌లో బలమైన ఇమేజ్ సొంతం చేసుకోవడం చరణ్‌కు పెద్ద ప్లస్ పాయింట్. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడితో ఉన్న సాన్నిహిత్యం ఆయన కెరీర్ ప్లానింగ్‌కు కొండంత అండగా నిలుస్తోంది. ఇక అల్లు అర్జున్ తనకంటూ  సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. `పుష్ప` చిత్రంతో నార్త్ ఇండియాలో ఆయన సృష్టించిన ప్రభంజనం టాలీవుడ్‌లోనే ఒక అరుదైన రికార్డు.

బన్నీకి ఉన్న అతిపెద్ద బలం హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ. ప్రతి సినిమాలోనూ లుక్ పరంగా, నటన పరంగా వైవిధ్యం చూపించడంలో సిద్ధహస్తుడు. లొకేష్ క‌న‌గ‌రాజ్, త్రివిక్రమ్ , సందీప్ రెడ్డి వంగా  వంటి దర్శకులతో ఆయన  లైనప్ చూస్తుంటే బాక్సాఫీస్ వసూళ్ల పరంగా బన్నీ సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. మాస్ పల్స్ పట్టడంలో బన్నీకున్న వేగం రేసులో ముందుంచుతోంది.

ఎవరు పెద్ద స్టార్ అయ్యే అవ‌కాశ ఉందంటే?  వారు ఎంచుకునే కథలు, యూనివర్సల్ అప్పీల్ మీద ఆధారపడి ఉంటుంది. చరణ్ గ్లోబల్ ఆడియన్స్‌కు నచ్చే కథలపై దృష్టి పెడుతుంటే, బన్నీ భారతీయ మూలాలున్న రా అండ్ రస్టిక్ కథలతో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నారు. వసూళ్ల పరంగా బన్నీ అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉండగా బ్రాండ్ ఇమేజ్ , అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పరంగా చరణ్ ముందంజలో ఉన్నారు. అంతిమంగా  ప్రేక్షకులకు నిరంతరం వైవిధ్యమైన వినోదాన్ని అందించే వారే అగ్రస్థానంలో నిలుస్తారు. రాబోయే ఐదేళ్లలో వీరిద్దరి మధ్య జరిగే ఆరోగ్యకరమైన పోటీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరో మెట్టు ఎక్కించే అవ‌కాశాలున్నాయి.

Ram charan Vs Allu Arjun:

  Healthy competition between Ram charan and Allu Arjun  

Tags:   RAM CHARAN
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ