Advertisementt

AA 23-దర్శకుడుకి కళ్ళు చెదిరే రెమ్యునరేషన్

Tue 10th Mar 2026 12:14 PM
lokesh kanagaraj  AA 23-దర్శకుడుకి కళ్ళు చెదిరే రెమ్యునరేషన్
Lokesh Kanagaraj quoted around 75 Cr as remuneration for AA23 AA 23-దర్శకుడుకి కళ్ళు చెదిరే రెమ్యునరేషన్
Advertisement
Ads by CJ

క్రేజీ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తతం తమిళ డైరెక్టర్ అట్లీ తో AA 22 చిత్రం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ కి రీసెంట్ గా జరిగిన అల్లు శిరీష్ పెళ్లి వేడుకల కోసం చిన్నపాటి బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ అప్ డేట్ అల్లు అర్జున్ బర్త్ డే ఏప్రిల్ 8 కి ఇవ్వడానికి దర్శకుడు అట్లీ రెడీ అవుతున్నారు.

అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టేసారు. అది కూడా కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో అల్లు అర్జున్ AA 23 ని అనౌన్స్ చేసారు. కూలి చిత్రంతో డిజప్పాయింట్ చేసినప్పటికీ లోకేష్ కనగరాజ్ ని నమ్మి అల్లు అర్జున్ అవకాశం ఇవ్వడం ఎలా ఉన్నా ఈప్రాజెక్టు కోసం లోకేష్ కనగరాజ్ తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.

AA23 ప్రాజెక్ట్ కోసం కోసం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుండి భారీగా రూ.75 కోట్లకు పైగా పారితోషికం అందుకోవడమే కాకుండా.. అదనంగా లాభాల్లో కొంత శాతం షేర్ కూడా లోకేష్ కనగరాజ్ కి ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. మరి నిజంగా ఇది మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. 

Lokesh Kanagaraj quoted around 75 Cr as remuneration for AA23:

Lokesh Kanagaraj is reportedly set to receive around ₹75 crore for AA23

Tags:   LOKESH KANAGARAJ
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ