Advertisementt

మెగా కోడలికి ఆన్‌లైన్ వేధింపులు

Tue 10th Mar 2026 11:36 AM
lavanya tripathi  మెగా కోడలికి ఆన్‌లైన్ వేధింపులు
Lavanya Tripathi has reportedly filed a complaint మెగా కోడలికి ఆన్‌లైన్ వేధింపులు
Advertisement
Ads by CJ

హీరోయిన్ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ని వివాహం చేసుకుని నాగబాబు ఇంట కోడలిగా మెగా ఫ్యామిలోకి అడుగు పెట్టింది. అత్త మామలు నాగబాబు-పద్మజలతో కలిసి భర్త వరుణ్ తేజ్ తో సంతోషంగా ఉంటున్న లావణ్య త్రిపాఠి తన కెరీర్ లో కొనసాగుతుంది. రీసెంట్ గానే నాగబాబు కి వారసుడు ని అందించిన లావణ్య త్రిపాఠి ఈమధ్యన అల్లు శిరీష్ పెళ్లి వేడుకల్లో భర్త తో కలిసి సందడి చేసింది.

అయితే తాజాగా లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో తనపై మరియు తన కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారని ఆమె కంప్లైంట్ చేసారు. 

పర్పుల్ క్రెయాన్00 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అవమానకర పోస్టులు చేస్తున్నారని లావణ్య త్రిపాఠి ఫిర్యాదు చేసారు. లావణ్య త్రిపాఠి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు బీఎన్ఎస్ 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Lavanya Tripathi has reportedly filed a complaint :

Lavanya Tripathi Hits Back At Online Trolls

Tags:   LAVANYA TRIPATHI
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ