ఏజెంట్ సినిమా అప్పటి నుంచి నిన్నమొన్నటి లెనిన్ వరకు అఖిల్ అక్కినేని ఒకే విధమైన హెయిర్ స్టయిల్ ని, ఒకే విధమైన లుక్ ని మైంటైన్ చేసాడు. పెళ్ళికి కూడా అఖిల్ బీస్ట్ మోడ్ లోనే కనిపించాడు. లెనిన్ చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అవడంతో అఖిల్ ఇప్పుడు తన లుక్ ని చేంజ్ చేసాడు.
ఆ విషయం T20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఇండియా vs న్యూజిలాండ్ మ్యాచ్ కి వెళ్ళినప్పుడే అందరూ చూసారు. అహ్మదాబాద్ స్టేడియం లో అఖిల్ కొత్త లుక్ చూసి అభిమానులు చాలా సర్ ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అఖిల్ హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు. అది కూడా చాలా స్టైలిష్ లుక్ లో.. అఖిల్ ని చూసి అభిమానూలు సంబరపడిపోతున్నారు.
అఖిల్ కొత్త లుక్ అదిరిందేహే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అఖిల్ లెనిన్ చిత్రం మే 1 నుచి పోస్ట్ పోన్ కాబోతుంది. ఇది ఫిక్స్. ఆతర్వాత కొత్త డేట్ ఏమిటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పెద్ది కారణంగా లెనిన్ కొత్త తేదీ ని వెతుక్కుంటుంది. దాని కోసమే అక్కినేని అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు.




AA 23-దర్శకుడుకి కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ 
Loading..