పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చి బాబు తో కలిసి చేస్తున్న క్రేజీ పాన్ ఇండియా ఫిలిం పెద్ది. ఏప్రిల్ 30 న విడుదల కాబోతున్న పెద్ది చిత్రం పై విపరీతమైన అంచనాలున్నాయి. ఇప్పటికే పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ షాట్, రెండు సాంగ్స్ చికిరి చికిరి, రయ్.. రయ్ రా..రా లు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
అందుకే పెద్ది పై మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ మొదలైంది. పాన్ ఇండియా భాషల నుంచి పెద్ది థియేట్రికల్ రైట్స్ కి క్రేజీ ఆఫర్స్ మొదలయ్యాయి అని తెలుస్తుంది. ఆంధ్ర నుంచి ఓవర్సీస్ వరకు పెద్ది కి వస్తున్న బిజినెస్ డీల్స్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఏ డీల్ సెట్ కాలేదు కానీ.. నైజాం నుంచి 65 కోట్ల వరకు బయ్యర్లు కొనేందుకు రెడీ అవుతున్నారట.
ఓవర్సీస్ 40 కోట్లు వరకు, కర్ణాటక 23 కోట్లు డీల్స్ పూర్తయినట్లుగా టాక్. సీడెడ్ 35 కోట్ల, కోస్టల్ ఆంధ్ర 85 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మరోపక్క నార్త్ నుంచి బడా ప్రొడక్షన్స్ కంపెనీస్ పెద్ది హిందీ రైట్స్ కోసం పోటీపడుతున్నట్లుగా తెలుస్తుంది. పెద్ది నుంచి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చెయ్యడమే ఇందుకు కారణమని అంటున్నారు.




గద్దర్ అవార్డుల్లో పారదర్శకత!

Loading..