గద్దర్ అవార్డుల ఎంపిక ప్రక్రియను, జూరీ వ్యవహారాలను ఎలా తిడదామా? అని ఎదురు చూసానని అన్నారు తమ్మారెడ్డి భరద్వాజా..
అసలు అవార్డులు అంటేనే అదొక ప్రహసనం అని భావిస్తారు. చాలా మంది ప్రముఖ ఆర్టిస్టులు అవార్డులు తీసుకునేందుకు సుముఖంగా లేరు. ఇవన్నీ తూతూ మంత్రం వ్యవహారంగా భావిస్తుంటారు. అవార్డుల కమిటీని లేదా జూరీని మ్యానిప్యులేట్ చేస్తే వచ్చేవి అవార్డులు అని భావించేవారున్నారు.. కానీ ఈసారి గద్దర్ అవార్డుల జూరీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని, దిల్ రాజు సారథ్యంలోని జూరీ న్యాయం చేసిందని ప్రశంసలు కురిపించారు తమ్మారెడ్డి భరద్వాజా...
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ - 2025 విజేతల ప్రకటన సందర్భంగా ప్రముఖ నిర్మాత, జ్యూరీ సభ్యుడు తమ్మారెడ్డి భరద్వాజ సూటిగా మాట్లాడుతూ.. ఈ ఎంపిక ప్రక్రియలో సమతుల్యతను ప్రశంసించారు. ఇందులో ఈటీవీ విన్ నిర్మించిన చిన్న సినిమాలకు ప్రోత్సాహం లభించిందని ఆనందం వ్యక్తం చేసారు.
యువతరం దర్శకనిర్మాతలు మంచి సినిమాలు తీస్తున్నారని కూడా కొనియాడారు. సుమారు 14 ఏళ్ల తర్వాత మళ్లీ అవార్డుల ప్రక్రియ ప్రారంభం కావడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అవార్డులను పట్టించుకోలేదని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దర్ పేరుతో వీటిని పునరుద్ధరించడం అభినందనీయమన్నారు. ఉగాది రోజున జరిగే అవార్డుల ప్రదానోత్సవం సినీ పండుగలా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.




ఈవారం థియేట్రికల్ అండ్ ఓటీటీ రిలీజులు 

Loading..