Advertisementt

విశ్వంభ‌ర ఉలుకు.. ప‌లుకు అందుకే లేదా!

Sun 08th Mar 2026 06:25 PM
vishwambhara  విశ్వంభ‌ర ఉలుకు.. ప‌లుకు అందుకే లేదా!
Vishwambhara update విశ్వంభ‌ర ఉలుకు.. ప‌లుకు అందుకే లేదా!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో  తెర‌కెక్కుతోన్న `విశ్వంభ‌ర‌` రిలీజ్ లో ఎలాంటి జాప్యం చోటు చేసుకుంటుందో తెలిసిందే. చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి కాక‌పోవ‌డంతో రిలీజ్ అంత‌కంత‌కు వాయిదా ప‌డుతుంది. ఆ ప‌న‌లు ముగించుకుని స‌మ్మ‌ర్ లోనైనా సినిమా రిలీజ్ అవుతుంద‌ని మెగా అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

కానీ వాళ్ల ఆశ‌ల‌పై మ‌ళ్లీ నీళ్లు జ‌ల్లేసేలా ఉన్నారు. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో కూడా రిలీజ్ చేయ‌డం అసాధ్యంగా క‌నిపిస్తోందంటున్నారు. విజువ‌ల్ ఎఫెక్స్ట్ కి సంబంధించిన ప‌నులు ఇప్ప‌టికీ ఓ కొలిక్కి రాలేద‌ని వినిపిస్తోంది. వాటి కోస‌మే మ‌రో నాలుగు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు. ఈ కార‌ణంగానే సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ కూడా ఇవ్వ‌డం లేద‌న్న‌ది స‌మాచారం.

ఏప్రిల్, మే నెల‌లో రిలీజ్ చేయాల‌నుకుంటే? ఇప్ప‌టికే ఏదో ఒక అప్డేట్ ఇచ్చేవార‌ని కానీ సైలెంట్ గా ఉన్నారంటే?గ్రాఫిక్స్ ప‌నులు ముగింపుకు చేరుకోక‌పోవ‌డంతోనే గోప్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  ఈనేప‌థ్యంలో సినిమాను ద‌సరా వ‌ర‌కూ వాయిదా వేయాల‌ని భావిస్తున్నారుట‌.

మొత్తానికి ఈ సినిమా రాజ‌మౌళి సినిమా రిలీజ్ ల‌నే మించిపోయేలా క‌నిపిస్తోంది. `బాహుబ‌లి` రిలీజ్ చేయ‌డానికి కూడా రాజ‌మౌళి ఇంత స‌మ‌యం తీసుకోలేదు. `విశ్వంభ‌ర` 2023 అక్టోబ‌ర్ లో ప్రారంభ‌మైంది.  అంటే రెండు సంవ‌త్స‌రాలు దాటిపోయింది.

Vishwambhara update:

Vishwambhara release update

Tags:   VISHWAMBHARA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ