ఇంటర్ ఎగ్జామ్స్ ముగిసిపోయాయి, 10th CBSC ఎగ్జామ్స్ అయిపోయాయి. పిల్లలు సరదాగా థియేటర్ కి వెళ్లి సినిమాలు చూద్దామంటే బాక్సాఫీసు దగ్గర సరైన సినిమా లేదు. సంక్రాంతి సీజన్ లో వచ్చిన సినిమాల తర్వాత మళ్లీ ఇప్పటివరకు క్రేజీ సినిమాలు ఏవి బాక్సాఫీసు దగ్గర సందడి చెయ్యలేదు.
ప్రతివారం పొలోమంటూ సినిమాలు విడుదలవుతున్నాయి కానీ అందులో ఏ ఒక్కటి ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చెయ్యలేకపోతున్నాయి. ఫిబ్రవరి అంటే ఎగ్జామ్స్ ఫీవర్ ఉంటుంది. మార్చ్ మొదలైతే క్రేజీ మూవీస్ రావాలి. మీడియం రేంజ్ హీరోలు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. మార్చి 19 వరకు ఈ బాక్సాఫీసు నీరసం ఇలానే ఉండేలా ఉంది.
ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 మార్చ్ 19 ఉగాది స్పెషల్ గా లాంగ్ వీకెండ్ ని చూజ్ చేసుకున్నాయి. అవి వచ్చే వరకు థియేటర్స్ దగ్గర సందడి కనిపించేలా లేదు. ప్రస్తుతం థియేటర్స్ అన్ని ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. బాక్సాఫీసు బావురుమంటుంది. నిన్న శుక్రవారం విడుదలైన సినిమాలు కూడా ప్రేక్షకులను ఫుల్ గా డిజప్పాయింట్ చేసాయి.
ప్రస్తుతం బాక్సాఫీసు హోప్స్ అన్ని ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 పైనే ఉన్నాయి.




విశ్వంభర ఉలుకు.. పలుకు అందుకే లేదా!
Loading..