Advertisementt

ఫౌజీ షూట్ 40 రోజులే బ్యాలెన్స్!

Sun 08th Mar 2026 06:22 PM
fauzi  ఫౌజీ షూట్ 40 రోజులే బ్యాలెన్స్!
Fauzi movie shooting update ఫౌజీ షూట్ 40 రోజులే బ్యాలెన్స్!
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఫౌజీ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవాలి. కానీ ప్ర‌భాస్ `ది రాజాసాబ్` తో పాటు `స్పిరిట్` చిత్రం షూటింగ్ కూడా మొద‌లు పెట్ట‌డంతో?   పౌజీ షూటింగ్ డిలే అవుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ  ఈ సినిమా షూటింగ్ ఎంత వ‌ర‌కూ పూర్త‌యిందంటే దాదాపు ముగింపు ద‌శ‌కు వ‌చ్చిన‌ట్లే తెలుస్తోంది.

85 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. మిగిలిన 15 శాతం షూట్ న‌ల‌భై రోజుల్లో ముగించే దిశ‌గా మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారుట‌. ప్ర‌భాస్ పుల్ గా డేట్లు ఇస్తే ఇప్ప‌టికే పూర్త‌య్యేది. కానీ ఏక కాలంలో `స్పిరిట్` షూటింగ్ కి కూడా అటెండ్ అవ్వ‌డంతో ఆల‌స్య‌మ‌వుతుంది. ఇప్ప‌టికే   `పౌజీ` రిలీజ్ ను ప్ర‌క‌టించిన  సంగ‌తి తెలిసిందే.

స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నారు. షూటింగ్ పూర్త‌యినంత వ‌ర‌కూ పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి.  సినిమాకు సంబంధించిన ప్ర‌చార చిత్రాలు కూడా పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌భాస్ లుక్ స‌హా టైటిల్ పోస్ట‌ర్ తో పాటు కాన్సెప్ట్ పోస్ట‌ర్లు మాత్ర‌మే రిలీజ్ చేసారు. ఇక‌పై గ్లింప్స్ తో అస‌లైన హ‌డావుడి  మొద‌లు కానుంది. అటుపై టీజ‌ర్, ట్రైల‌ర్ ఒక్కొక్క‌టిగా రిలీజ్  చేస్తారు.

Fauzi movie shooting update:

Fauzi movie 

Tags:   FAUZI
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ