శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ లో జోరు చూపిస్తుంది. టాలీవుడ్ లో డల్ అయిన శ్రీలీల మరోపక్క కోలీవుడ్ లో వరస అవకాశాలతో దూసుకుపోతుంది. అందరూ స్టార్ హీరోలే ఆమెకు ఆఫర్స్ ఇస్తున్నారు. ఇక బాలీవుడ్ లో ఆమె నటించిన సినిమా ఒక్కటి కూడా ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు,
అప్పుడే బాలీవుడ్ లో ఆఫర్స్ మీద ఆఫర్స్. కార్తీక్ ఆర్యన్ హీరో గా శ్రీలీల నార్త్ ఎంట్రీ ఇస్తుంది. ఇంకా టైటిల్ పెట్టని ఆ మూవీ విడుదల కాకముందే కార్తీక్ ఆర్యన్ తో మరో మూవీకి సైన్ చేసింది అనే వార్త ప్రచారంలో ఉంది. ఇప్పుడు అది ఓకే అయినట్లుగా తెలుస్తుంది. అందులో శ్రీలీలను హీరోయిన్ గా అనుకుంటున్నారట.
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కార్తిక్ ఆర్యన్ సరసన శ్రీలీల కనిపించబోతుంది అని, కార్తీక్ ఆర్యన్ కిక్ బాక్సింగ్ కోచ్ పాత్ర కోసం ప్రస్తుతం ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడట. మరి షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ చిత్రంలో శ్రీలీల ఫిక్స్ అంటే మాములు విషయం కాదు, అమ్మడు లక్కే లక్కు.




విశ్వక్ సేన్ ఫంకీ ఓటీటీ డేట్ ఫిక్స్ 

Loading..