నిన్న ఫిబ్రవరి 26 న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రష్మిక మందన్న పెళ్లి కూతురుగా రెడ్ శారీ లో ట్రెడిషనల్ గా కనిపించగా.. విజయ్ దేవరకొండ షర్ట్ లేకుండా సాంప్రదాయమైన పట్టు పంచేలో పెళ్లి కొడుకుగా అద్దరగొట్టేసాడు.
అయితే విజయ్ దేవరకొండ - రష్మిక లు తమ పెళ్లిని చాలా తక్కువమంది అతిధుల నడుమ చేసుకున్నారు. కానీ మార్చ్ 4 న హైదరాబాద్ తాజ్ కృష్ణ లో జరగబోయే వెడ్డింగ్ రిసెప్షన్ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనుంచి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా వరకు, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులకు విజయ్-రష్మిక ఆహ్వానాలు అందించారు.
విజయ్ దేవరకొండ-రష్మికలు పర్సనల్ గా అమిత్ షాని కలిసారు. అంతేకాదు పీఎం మోడీని కూడా తమ పెళ్ళికి ఆహ్వానించిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందే విజయ్ దేవరకొండ-రష్మిక వివాహం సందర్భంగా మోడీ గ్రీటింగ్స్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
తాజాగా విజయ్ దేవరకొండ-రష్మికలు వ్యక్తిగతంగా ప్రధాని మోడీ అప్పోయింట్మెంట్ తీసుకుని మరీ పెళ్లి ఆపత్రిక అందించారు. మరి విజయ్-రష్మీక VIROSH వెడ్డింగ్ రిసెప్షన్ కి ఎంతమంది రాజకీయనాయకులు హాజరు కానున్నారో చూడాలి.




విష్ణు విన్యాసం ఓవర్సీస్ టాక్ 

Loading..