Advertisementt

విష్ణు విన్యాసం ఓవర్సీస్ టాక్

Fri 27th Feb 2026 11:02 AM
vishnu vinyasam   విష్ణు విన్యాసం ఓవర్సీస్ టాక్
Vishnu Vinyasam overseas talk విష్ణు విన్యాసం ఓవర్సీస్ టాక్
Advertisement
Ads by CJ

కామెడీ కి కేరాఫ్ గా నిలిచే హీరో శ్రీ విష్ణు నుంచి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా అది ఎంటర్టైనర్ అని ఆడియన్స్ ఫిక్స్ అవుతారు. తన భాషలోని యాస తోనే శ్రీవిష్ణు చేసే సింపుల్ కామెడీకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. యదునాథ్ మారుతీ రావు డైరెక్షన్ లో శ్రీవిష్ణు-నయనసారిక జంటగా తెరకెక్కిన విష్ణు విన్యాసం ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో నేడు ఫిబ్రవరి 27 న థియేటర్స్ లో విడుదలైంది.

ప్రీమియర్స్ లేకుండా, ఉదయమే ప్రెస్ కి షో వెయ్యకుండా మేకర్స్ 10 తర్వాత టాక్ బయటికి వచ్చేలా ప్లాన్ చేసారు. ఇక ఓవర్సీస్ లో విష్ణు విన్యాసం షోస్ పూర్తి కావడంతో ఆడియన్స్ ఆగుతారా.. సోషల్ మీడియా వేదికగా విష్ణు విన్యాసం వీక్షించడమే తరువాయి సినిమా అలా ఉంది, ఇలా ఉంది అంటూ ట్వీట్లతో యుద్ధం స్టార్ట్ చేశారు.

దర్శకుడు యదునాథ్ మారుతీ కామెడీని బాగా వర్కౌట్ చేసాడు, ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది, శ్రీవిష్ణు కామెడీ టైమింగ్, హీరో-హీరోయిన్ కెమిస్ట్రీ, ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్ని కుదిరాయంటూ సినిమా చూసిన ఆడియన్స్ కొంతమంది ట్వీట్లు పెడుతున్నారు. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కామెడీ వర్కౌట్ అయినా ఎమోషనల్ పార్ట్ కొంత ల్యాగ్ అనిపించడం బోర్ కొట్టింది అంటున్నారు.

రథన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలకు ఎలివేట్ చేసింది. స్లో పేస్, మీమ్ రిఫరెన్స్‌లు ఎక్కువగా ఉండటం కొంత డిజప్పాయింట్ చేసే విషయము.. ఆడియన్స్ ను స్ట్రెస్ రిలీఫ్ చేసే చిత్రంగా విష్ణు విన్యాసం నిలుస్తుంది. 100 శాతం ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోయినా.. మీ టికెట్ రేటుకి సరిపడా నవ్వులు అయితే ఉంటాయి, మాది హామీ అంటూ ఓవర్సీస్ ఆడియన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. 

Vishnu Vinyasam overseas talk:

Vishnu Vinyasam overseas public talk

Tags:   VISHNU VINYASAM
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ