Advertisementt

లిక్కర్ స్కామ్ కేసులో కవిత కు బిగ్ రిలీఫ్

Fri 27th Feb 2026 12:36 PM
kavitha  లిక్కర్ స్కామ్ కేసులో కవిత కు బిగ్ రిలీఫ్
Big relief for Kavitha in liquor scam case లిక్కర్ స్కామ్ కేసులో కవిత కు బిగ్ రిలీఫ్
Advertisement
Ads by CJ

లిక్కర్ పాలసీ కేసులో కొన్ని నెలల పాటు జైలు లో ఉండి వచ్చిన జాగృతి అధ్యక్షురాలు కవిత.. అప్పుడు ఆ కేసులో తనకు సపోర్ట్ గా లేరు అని తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ హరీష్ రావు లపై కక్ష కట్టి బీఆర్ఎస్ ను వదిలి బయటకి వచ్చేసి కొత్త పార్టీ సన్నాహాల్లో ఉంది. లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారనే కారణంగా తో కవిత ను తీహార్ జైలులో ఉంచారు. తర్వాత బెయిలుపై బయటికి వచింది. కవిత అలాగే ఈ కేసులో కొన్నిరోజులు జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్, మణీష్ సిసోడియా సహా అందరికి ఇప్పుడు బిగ్ రిలీఫ్ దొరికింది.

లిక్కర్ కేసులో స్పష్టమైన అధరాలు లేవు అనే కారణంతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వారిపై నమోదైన కేసులను కొట్టివేసింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు లిక్కర్ పాలసీ కేసులో ఉన్న  23 మంది నిందితులను విముక్తి చేసింది. మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆప్ నాయకుడు మణీష్ సిసోడియాకు డిశ్చార్జ్ మంజూరు.

ఈ కేసులో సరైన ఆధారాలు లేని కారణంగా ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఈరకమైన తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా ఈకేసులో సీబీఐ దర్యాప్తులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. 

మణీష్ సిసోడియాపై, కేజ్రీవాల్‌ పై ప్రాథమిక కేసు నిలబడే ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం చట్టపరంగా సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కుల్దీప్ సింగ్‌పై కూడా స్పష్టమైన ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది.

అదే సమయంలో సీబీఐ దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణకు కోర్టు ఆదేశించింది. సో కొన్ని నెలల పాటు జైలు లో ఉన్న కవిత, అరవింద్ కేజ్రీవాల్, మణీష్ సిసోడియాకు ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఈరకంగా భారీ ఊరట లభించింది. 

Big relief for Kavitha in liquor scam case:

Kavitha gets big relief in Delhi liquor scam case

Tags:   KAVITHA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ