పెద్ది చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దానిని ముగించే పనిలో ఉన్నారు. పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో సినిమా అనౌన్స్ చేసారు. సుకుమార్ RC17 ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా వున్నారు. పుష్ప తర్వాత సుకుమార్ RC17పైనే ఉన్నారు.
అయితే ఇప్పడు సుకుమార్ రామ్ చరణ్ ని చిన్న కన్ఫ్యూజన్ లోకి నెట్టినట్టుగా తెలుస్తుంది. అదెలా అంటే రామ్ చరణ్ కి సుకుమార్ ఓ స్టోరీ వినిపించారు. అది చరణ్ కి నచ్చడమే కాదు ఆయన ఎప్పుడో ఓపెనింగ్ షాట్ తెరకెక్కించారని టాక్ ఉంది. కానీ ఇప్పుడు రామ్ చరణ్ కోసమే సుకుమార్ మరో కథ కూడా రెడీ చేశారట.
సుకుమార్ రామ్ చరణ్ కి కథ రాసిన కథ ఇంకా బావుంది. మరి ఇప్పుడు సుకుమార్ తో రామ్ చరణ్ ఏ కథ చెయ్యాలనే నిర్ణయం పూర్తిగా రామ్ చరణ్ చేతుల్లోనే ఉందట. సో ఇది రామ్ చరణ్ కన్ఫ్యూజ్ అయ్యే విషయమే కానీ.. ఏ కథ బావుంటే.. ఆ కథ తోనే రామ్ చరణ్ సుక్కు తో సినిమా మొదలు పెడతారు. అది ముందు కథా, తర్వాత కథా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.




జననాయగన్ ఏప్రిల్ కూడా డౌటే
Loading..