బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా డిసెంబర్ 5 న హిందీ లో విడుదలై సన్సెషనల్ హిట్ అయ్యింది. కేవలం నార్త్ లోనే ధురంధర్ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ తో రికార్డ్ లను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ధురంధర్ 2 మార్చ్ 19 న విడుదల అని మేకర్స్ అనౌన్స్ చేసారు.
కానీ ధురంధర్ మార్చ్ 19 రావడం సాధ్యమేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. ధురంధర్ ద రివెంజ్ పై ఉన్న అంచనాలు చూసి ధురంధర్ తో పోటీ అవసరమా అని ముందుగా మార్చ్ మూడో వారం, నెలాఖరులో విడుదల అని అనౌన్స్ చేసిన సినిమాలన్నీ సైలెంట్ గా పోస్ట్ పోన్ అయ్యాయి. కానీ ఇప్పుడు ధురంధర్ 2 మార్చ్ 19 న వచ్చేలా కనిపించడం లేదు.
ధురంధర్ 2 విడుదలకు సరిగ్గా నెల సమయముంది. కానీ ఇంకా షూటింగ్ జరుగుతుంది. కొన్ని రీషూట్స్ బాకీ ఉన్నాయని అలాగే సంగీతం పరంగా పనులు పెండింగ్ ఉన్నాయట. ఆ లెక్కన ధురంధర్ 2 మార్చ్ 19 రావడం సాధ్యమేనా అనే అనుమానాలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. చూద్దాం ధురంధర్ మేకర్స్ ఎలాంటి షాక్ ఇస్తారో అనేది.




రామ్ చరణ్ ని కన్ఫ్యూజన్ లో పెట్టిన సుక్కు 
Loading..