Advertisementt

జ‌న‌నాయ‌గ‌న్ ఏప్రిల్ కూడా డౌటే

Thu 19th Feb 2026 09:42 AM
vijay  జ‌న‌నాయ‌గ‌న్ ఏప్రిల్ కూడా డౌటే
Jana Nayagan జ‌న‌నాయ‌గ‌న్ ఏప్రిల్ కూడా డౌటే
Advertisement
Ads by CJ

దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందించిన భారీ చిత్రం రిలీజ్ కి రాక‌పోతే, సెన్సార్ గ‌డ‌ప‌పైనే ఎదురు చూపులు చూస్తుంటే, కోర్టులు విడుద‌లకు సానుకూలంగా స్పందించ‌క‌పోతే, ఆ సినిమా తీసిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించ‌గ‌ల‌రా?

ప్ర‌స్తుతం అలాంటి టెన్ష‌న్ లోనే ఉన్నారు జ‌న‌నాయ‌గ‌న్ ద‌ర్శ‌కుడు, నిర్మాత‌. ముఖ్యంగా ఈ సినిమా స‌క్సెస్ పై ఎన్నో హోప్స్ పెట్టుకున్న న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు హెచ్.వినోద్ తీవ్ర ఒత్తిడిని అనుభ‌విస్తున్నాడు. కొన్ని సినిమాల విష‌యంలో రిలీజ్ కి స‌హ‌క‌రించిన క్రిటిక్స్, సినీపెద్ద‌లు కూడా ఇప్పుడు జ‌న‌నాయ‌గ‌న్ విష‌యంలో స‌హాయం చేయ‌డానికి ముందుకు రావ‌డం లేద‌ని ఆవేద‌న చెందాడు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాలు వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వెళుతున్న క్ర‌మంలో ఈ చివ‌రి సినిమా ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కం. దీని విడుద‌ల స‌జావుగా సాగాలి. విజ‌యం అందించాల‌ని క‌సిగా ప‌ని చేసిన వినోద్ కి చివ‌రిలో ఊహించ‌ని ట్విస్ట్ ఎదురైంది. సెన్సార్ ఈ సినిమాలో మ‌త‌ప‌ర‌మైన సున్నిత అంశాలున్నాయ‌ని మ‌నోభావాలు గాయ‌ప‌డ‌తాయ‌ని వ్యాఖ్యానించ‌డ‌మే గాక‌, ఇందులో ఆర్మీని అవ‌మానించేలా కొన్ని సంభాష‌ణ‌లు ఉన్నాయ‌ని వ్యాఖ్యానించ‌డంతో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ప్ర‌స్తుతానికి రిలీజ్ విష‌యంలో ఇంకా స్ప‌ష్ఠ‌త రాలేదు. సెన్సార్ పూర్త‌వ్వ‌లేదు. దీంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. జ‌న‌వ‌రిలో ఒక‌సారి వాయిదా ప‌డింది. ఫిబ్ర‌వ‌రిలో వ‌స్తుంద‌న్నారు.. అయినా క్లారిటీ రాలేదు. లేటెస్టుగా ఏప్రిల్ 30 లోపు వ‌స్తుంద‌ని ఊహాగానాలు సాగుతున్నా, దానిపైనా స్ప‌ష్ఠ‌త కొర‌వ‌డింది. దీంతో ఇంత పెద్ద సినిమాకి ఈ చిక్కులేంటో అర్థం కాని గంద‌ర‌గోళంలో విజ‌య్ ఫ్యాన్స్ ఉన్నారు. 

Jana Nayagan:

Vijay Jana Nayagan

Tags:   VIJAY
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ