యంగ్ టైగర్ ఎన్టీఆర్-నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్ ప్రస్తుతం జోర్డాన్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్-మలయాళ స్టార్ తోవినో థామస్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు చిత్రీకరిస్తున్న భారీ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ నిలవనున్నాయని చెబుతున్నారు.
ఎన్టీఆర్-నీల్ యాక్షన్ సీక్వెన్స్‌లో ఇప్పటివరకు చూడని కొత్త ఎన్టీఆర్ ని చూస్తారని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం నీల్ మూవీ కోసం బాగా వెయిట్ తగ్గిన ఎన్టీఆర్ లుక్స్ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింట్ మోడ్ లో ఉన్నా.. ఎన్టీఆర్ డ్రాగన్ లుక్ మాత్రం సినిమాలో చాలా బావుంటుంది అంటున్నారు .
ఇక జోర్డాన్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత హీరోయిన్ రుక్మిణి వసంత్-ఎన్టీఆర్ లపై ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ ప్లాన్ చేస్తున్నారట, ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో యాక్షన్ కి ఎంతగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో.. సాంగ్స్ కి అంతే కేర్ తీసుకుంటున్నట్లుగా యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.




విజయ్ - రష్మిక పెళ్లి కి రూల్స్ చూసారా 

Loading..