Advertisementt

దిల్ రాజు నోటి వెంట పచ్చి నిజాలు

Wed 18th Feb 2026 08:19 PM
dil raju  దిల్ రాజు నోటి వెంట పచ్చి నిజాలు
No Value For Producers These Days-Dil Raju దిల్ రాజు నోటి వెంట పచ్చి నిజాలు
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న కల్చర్ పై డిస్ట్రిబ్యూటర్ మరియు ప్రొడ్యూసర్ దిల్ రాజు నోటి వెంట పచ్చి నిజాలు బయటికి వచ్చాయి. రీసెంట్ గా దిల్ రాజు తన భార్య తేజస్విని తో కలిసి అట్లూరి పూర్ణచంద్రరావు కూర్గ్ లో ఆరంభించిన రిసార్ట్స్ ఓపెనింగ్ కి వెళ్లారు. అక్కడ దిల్ రాజు సూపర్ స్టార్ రజినీకాంత్, ఇంకా ప్రముఖుల సమక్షంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి.

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలకు గౌరవం ఉండేది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి నిర్మాతే డబ్బులిచ్చేవారు కాబట్టి.. సెట్ లో ఆయన్ని అందరూ గౌరవించేవారని, కానీ ఇప్పుడు నిర్మాతలంటే గౌరవం లేదు, డబ్బులిచ్చేవారిని డబ్బులు తీసుకునే వాళ్ళు శాసిస్తున్నారు అంటూ దిల్ రాజు పచ్చి నిజాలు మట్లాడారు.

చాలామంది నిర్మాతలు దర్శకులకు, హీరోలకు ఎక్కడా నెప్పి కలగకూండా, అడిగింది ఇచ్చినా నిర్మాతలకు చివరికి చిల్లి గవ్వ మిగలడం లేదు. అలా చాలామంది నిర్మాతలు సఫర్ అవుతున్నారు. అదే ఇప్పుడు దిల్ రాజు ఓపెన్ అయ్యారు. ఒకప్పుడు నిర్మాతలు అందరిని శాసించేవారు, కానీ ఇప్పుడు డబ్బు తీసుకునే వాళ్ళే ఇచ్చేవాళ్లను శాసిస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. 

మరి దిల్ రాజు ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులను పూసగుచ్చినట్టుగా కాకపోయినా నిజంగా నిజాలే మాట్లాడారు. నిర్మాతలు ఎన్నో కోట్ల బడ్జెట్ పెట్టినా, అనుకున్న సమయానికి సినిమాలు విడుదల కాక, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి, ఆర్థికంగా నష్టపోతున్నారు, హిట్ అయిన సినిమాకి లాభాలు రాక, ప్లాప్ అయిన సినిమాలతో నష్టాల్లో కూరుకుపోయినా.. హీరోలు కానీ, దర్శకులు కానీ పారితోషికాల విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న రోజులివి. అదే దిల్ రాజు మట్లాడారు. 

No Value For Producers These Days-Dil Raju:

Dil Raju

Tags:   DIL RAJU
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ