విజయ్ దేవరకొండ-రష్మిక ఈ నెల 26 న వివాహం చేసుకోబోతున్నారు. ఫిబ్రవరి 26 న రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్ళి రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో జరగబోతుంది, మార్చ్ 4 న హైదరాబాద్ తాజ్ కృష్ణ లో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ జరగబోతున్నట్టుగా ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా అటు రష్మిక కానీ ఇటు విజయ్ దేవరకొండ కానీ పెళ్లి పై అఫీషియల్ అనౌన్సమెంట్ చెయ్యట్లేదు.
ఇక రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో రేపు 26 న జరగబోయే పెళ్ళికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొద్దిమంది సన్నిహితులు తప్ప పెద్దగా ఎవ్వరూ హాజరవరని.. పెళ్లికి వచ్చేవాళ్ళు నో సెలబ్రెటీ పాలసీ.. నో సెల్ఫోన్ అనే రూల్స్ ఫాలో అవ్వాలట. అంటే విజయ్ దేవరకొండ-రష్మిక స్వయంగా తమ పెళ్లి ఫొటోస్ షేర్ చేసేవరకు ఎవరూ వీరి పెళ్లి విషయాన్ని లీక్ చెయ్యకూడదన్నమాట.
ఇక మార్చి 4 న హైదరాబాద్ లో జరగపోయే వెడ్డింగ్ రిసెప్షన్ కి కూడా సేమ్ రూల్స్ పాటించాలని, ఇక మీడియాకి అటు పెళ్ళికి, ఇటు రిసెప్షన్ కి అనుమతి లేదని.. తర్వాత మీడియాకి స్పెషల్ లంచ్ ఏర్పాటు చేసి కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మిక కాసేపు వారితో టైమ్ స్పెండ్ చేస్తారని వినికిడి.




కల్కి 2 కోసం ప్రభాస్ డేట్స్ 

Loading..