Advertisementt

నేను ఎవ‌రి గొడ‌వ‌లో వేలు పెట్ట‌లేదు-స్టార్ హీరో

Wed 18th Feb 2026 10:26 AM
don 3  నేను ఎవ‌రి గొడ‌వ‌లో వేలు పెట్ట‌లేదు-స్టార్ హీరో
Don 3 - Farhan Akhtar May Step In After Ranveer Singh Exit నేను ఎవ‌రి గొడ‌వ‌లో వేలు పెట్ట‌లేదు-స్టార్ హీరో
Advertisement
Ads by CJ

గ్లామ‌ర్ రంగంలో వ‌రుస‌ వివాదాలు ఉక్కిరికిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో రోజుకో స‌మ‌స్య పుట్టుకొస్తోంది. దాదాపు 300కోట్ల బ‌డ్జెట్ తో రూపొందించ‌నున్న భారీ చిత్రం `డాన్ 3` షూటింగ్ ఇప్పుడు ఊహించ‌ని డైల‌మాలో ప‌డింది. సినిమా నుంచి చివ‌రి నిమిషంలో హీరో ర‌ణ్ వీర్ త‌ప్పుకోవడంతో నిర్మాత ఫ‌ర్హాన్ దీనిపై సీరియ‌స్ గా ఉన్నారు. 

ప్రీప్రొడ‌క్ష‌న్ కోసం అయిన 40కోట్ల ఖ‌ర్చును అత‌డు చెల్లించాల‌ని కార్పొరెట్ స్టైల్ లో ప‌ట్టుబ‌డుతున్నాడు. అయితే బౌండ్ స్క్రిప్టు అయినా లేదు.. అడ్వాన్స్ అయినా లేదు.. అలాంట‌ప్పుడు తాను ఎందుకు చెల్లించాలి? అంటూ ర‌ణ్ వీర్ కౌంట‌ర్ వేస్తున్నాడు.

అయితే ఈ గొడ‌వ‌ను ప‌రిష్క‌రించేందుకు ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (పీజీఐ) మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తోందని, ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విని ప‌రిష్కారం వెతుకుతోంద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. కానీ సినీ పెద్ద‌ల మ‌ధ్య ఈ స‌మ‌స్య ఎటూ తేల‌లేద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అమీర్ ఖాన్ ఇంట్లో జ‌రిగిన స‌మావేశంలో క‌ర‌ణ్ జోహార్, ఏక్తాక‌పూర్ ఇత‌ర సినీపెద్ద‌లు ఉన్నారు. 

కానీ వారి మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో వివాదం ప‌రిష్కృతం కాలేదు. ఇంత‌లోనే మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ముందుకు వ‌చ్చార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే దీనిని అత‌డు ఖండించారు. నేను ఎవ‌రి గొడ‌వ‌లోను వేలు పెట్ట‌లేద‌ని ధృవీక‌రించారు. దీంతో ప‌రిశ్ర‌మ‌లో ఇత‌ర స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించేందుకే అమీర్ ఖాన్ ఇంట్లో స‌మావేశం జ‌రిగింద‌ని అంతా భావిస్తున్నారు.

Don 3 - Farhan Akhtar May Step In After Ranveer Singh Exit:

A significant dispute has erupted between Ranveer Singh and Farhan Akhtar production house over Don 3

Tags:   DON 3
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ