Advertisementt

టాక్సిక్ - ఊపు రావట్లే

Wed 18th Feb 2026 11:19 AM
toxic  టాక్సిక్ - ఊపు రావట్లే
Toxic The Movie టాక్సిక్ - ఊపు రావట్లే
Advertisement
Ads by CJ

కేజిఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న టాక్సిక్ ద మూవీ పై అంచనాలు ఎలా ఉండాలి.. కానీ యష్ టాక్సిక్ పై పాన్ ఇండియా మార్కెట్ లో అంత ఊపు కనిపించడం లేదు, మార్చ్ 19 న రిలీజ్ అంటూ మేకర్స్ అదే రిలీజ్ డేట్ పై స్టిక్ అయ్యారు. రణ్వీర్ సింగ్ ధురంధర్ 2 దెబ్బకి ఎన్నో సినిమాలు వెనకడుగు వేసినా యష్ టాక్సిక్ మాత్రం తగ్గేదెలా అంది. 

మరి టాక్సిక్ విడుదలకు సరిగ్గా నెల సమయముంది. కానీ టాక్సిక్ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యలేదు, టాక్సిక్ టీజర్ పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన టాక్సిక్ పై అంచనాలు ఎంతగా ఉన్నాయో, పాన్ ఇండియా మార్కెట్ లో ఎంత హైప్ ఉందొ అనేది యష్ అభిమానులు అంచనా వేయలేకపోతున్నారు.

కేజిఎఫ్ తో పాన్ ఇండియా మార్కెట్ ను శాసించిన యష్ టాక్సిక్ తో అదేమాదిరి బాక్సాఫీసును దున్నేయాలని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. మరి మార్చ్ 19 ధురంధర్ 2 vs టాక్సిక్ క్లాష్ ఎలా ఉండబోతుందో, దేనిది పై చెయ్యి అవుతుంది, కేజిఎఫ్ తో వచ్చిన క్రేజ్ ని యష్ ఎంతవరకు కాపాడుకుంటాడో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. .

Toxic The Movie:

Toxic release on March 19th

Tags:   TOXIC
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ