Advertisementt

ఇలాంటి కష్టం ఏ హీరోకి రాకూడదు

Wed 18th Feb 2026 09:48 AM
mruthyunjay  ఇలాంటి కష్టం ఏ హీరోకి రాకూడదు
Sree Vishnu vs Sree Vishnu ఇలాంటి కష్టం ఏ హీరోకి రాకూడదు
Advertisement
Ads by CJ

చాలామంది హీరోలు సినిమా తమ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే నిర్మాతల మేలు కోరి సినిమాలను చాలా బాగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు బాగా కష్టపడి సినిమాలని ప్రమోట్ చేస్తారు. అలాంటి వారిలో నాని, శ్రీవిష్ణు, ఇంకా కొంతమంది యంగ్ హీరోలు ఉన్నారు. అయితే ఒకేరోజు ఒకే హీరో నటించిన సినిమాలు విడుదలైతే ఆ హీరో ఏం చేస్తాడు.

ఒకే రోజు కాకపోయినా, ఒకరోజు అటు ఇటుగా ఆ హీరో నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తెచ్చెందుకు నిర్మాతలు డిసైడ్ అయితే ఆ హీరో పరిస్థితి ఎలా ఉంటుంది.. అదే ఇప్పుడు శ్రీవిష్ణు కి వచ్చింది. శ్రీవిష్ణు.. మృత్యుంజయ్, విష్ణు విన్యాసం చిత్రాలతో ఫిబ్రవరి 27, 28 తేదీల్లో వరసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మరి శ్రీ విష్ణు ఏ సినిమాని ప్రమోట్ చెయ్యాలి, ఏ సినిమా ప్రెస్ మీట్లో ఏ సినిమా గురించి మాట్లాడాలి, అసలే మన మీడియా మిత్రులు ఒక సినిమా ఇంటర్వ్యూలో ఆ సినిమా విషయాలకన్నా మిగతా విషయాలపై ఫోకస్ పెడతారు. అలాగే అప్ కమింగ్ మూవీస్ గురించి దిగుతారు. శ్రీ విష్ణు ఏ సినిమా గురించి చెబితే ఏ సినిమా నిర్మాతకు కోపమొస్తుందో.

మరి శ్రీ విష్ణు ఏ సినిమా కోసం కష్టపడతాడో, ఏ సినిమాకి ఎక్కువ ప్రమోట్ చేస్తాడో, ఏ సినిమా తో శ్రీవిష్ణు హిట్ కొడతాడా అనే క్యూరియాసిటీతో ప్రేక్షకులు ఉంటె.. రెండు సినిమాల మధ్యన శ్రీవిష్ణు మాత్రం నలిగిపోతున్నాడు. నిజంగా ఇలాంటి కష్టం ఏ హీరో కి రాకూడదు. 

Sree Vishnu vs Sree Vishnu:

Mruthyunjay vs Vishnu Vinyasam

Tags:   MRUTHYUNJAY
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ