Advertisementt

వార‌సుడి స‌ర‌స‌న అంతా స్టార్ భామ‌లే!

Mon 16th Feb 2026 03:41 PM
junaid khan  వార‌సుడి స‌ర‌స‌న అంతా స్టార్ భామ‌లే!
Junaid Khan వార‌సుడి స‌ర‌స‌న అంతా స్టార్ భామ‌లే!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్  వార‌సుడిగా జునైద్ ఖాన్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. న‌టుడు కాక ముందే డాడ్ న‌టించిన సినిమాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసి ఇండ‌స్ట్రీలో అనుభ‌వం సంపాదించాడు. అనంత‌రం న‌టుడిగా తెరంగేట్రం చేసాడు. `మ‌హారాజ్`  చిత్రంలో లీడ్ రోల్ లో ప్రేక్ష‌కుల‌కు బాగానే క‌నెక్ట్ అయ్యాడు. అటుపై`ల‌వ్ యాప` తో మ‌రో సినిమా చేసాడు.

ఇందులో జునైద్ ఖాన్ కి జోడీగా అతిలోక సుంద‌రి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ క‌పూర్ న‌టించింది. ప్ర‌స్తుతం `ఏక్ దిన్` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇందులో జునైద్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి న‌టిస్తోంది. సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. సాయి ప‌ల్ల‌వి ఇమేజ్  సినిమాకు ప్ల‌స్ గా మారింది. తాజాగా `రాగిణి 3` లో లీడ్ రోల్ కు ఎంపిక‌య్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా  మిల్కీబ్యూటీ త‌మ‌న్నాను తీసుకుంటున్నారు.

అలాగే అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వంలో జునైద్ మ‌రో  సినిమాకు క‌మిట్ అయ్యాడు. ఇందులో హీరోయిన్ గా ఏకంగా అలియాభ‌ట్ నే రంగంలోకి దించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  దీంతో  జునైద్ స‌ర‌స‌న వ‌రుస‌గా స్టార్ భామ‌లే హైలైట్ అవుతున్నారు. జునైద్ ఖాన్ ఇమేజ్ తో ప‌ని లేకుండా స్టార్ భామ‌ల్ని ఎంపిక చేసి చిత్రాల్ని హైలైట్ చేస్తోన్న వైనం క‌నిపిస్తోంది.

జునైద్ ఖాన్ కి న‌టుడిగా పెద్ద‌గా అనుభ‌వం లేదు..స్టార్ ఇమేజ్ లేక‌పోయినా?  స్టార్ హీరోయిన్లు కూడా ముందుకు రావ‌డం విశేషం. ఇక్క‌డ అమీర్ ఖాన్ ఇమేజ్ కీల‌కంగా మారింది. బ్యాకెండ్ లో అమీర్ ఖాన్ కూడా ప‌నిచేస్తున్నాడా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Junaid Khan:

Aamir Khan son Junaid Khan

Tags:   JUNAID KHAN
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ