Advertisementt

2027 సంక్రాంతి కి ఫుల్ డిమాండ్

Fri 13th Feb 2026 05:23 PM
sankranthi  2027 సంక్రాంతి కి ఫుల్ డిమాండ్
2027 Sankranthi 2027 సంక్రాంతి కి ఫుల్ డిమాండ్
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతి సీజన్ లో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు వర్కౌట్ అవడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి డిమాండ్ పెరిగిపోయింది. ఈ ఏడాది సంక్రాంతి కి విడుదలైన సినిమాలు సో సో గా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించడంతో సూపర్ హిట్ అయ్యాయి. అంటే ఇక సంక్రాంతికి  ఎలాంటి సినిమా అయినా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తారనే ఊపులో వచ్చే ఏడాదికి హీరోలు ఇప్పటినుంచే గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు.

ఇప్పటికే సీనియర్ హీరోలు  బాలకృష్ణ-గోపీచంద్ కాంబో, చిరంజీవి-బాబీ కాంబో, వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబో, నాగార్జున-కళ్యాణ్ కృష్ణ కాంబో లు సంక్రాంతి కి రావడం పక్కాగా కనిపిస్తున్నారు. ఆతర్వాత శర్వానంద్ వచ్చే ఏడాది సంక్రాంతికి పక్కా అని చెప్పేసాడు. ఇక నితిన్.. ఇలా కుర్ర హీరోలు కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి తమ సినిమాలు తీసుకురావాలనే ఊపులో కనిపిస్తున్నారు.

ఇంకా మొదలు కానీ సురేందర్ రెడ్డి-పవన్ కళ్యాణ్ ల సినిమా కూడా 2026 సంక్రాంతికే అంటున్నారు. సో 2027సంక్రాంతి కి వచ్చే సినిమాల లిస్ట్ అంతకంతకు పెరిగిపోతున్నాయి, అందులో ఎన్ని బాక్సాఫీసు దగ్గరకు వస్తాయి అనేది కాస్త వేచి చూస్తే తెలుస్తుంది. 

2027 Sankranthi:

2027 Sankranthi Season

Tags:   SANKRANTHI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ