పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి ఎంత పెద్ద హిట్టో అనేది ఇంకా ఇంకా యూత్ ఫోన్స్ లో ట్రెండ్ అవుతుంటేనే అర్ధమవుతుంది. రామ్ చరణ్ సూపర్బ్ స్టెప్స్, జాన్వీ కపూర్ అందాలు, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అన్ని చికిరి చికిరి సాంగ్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణమయ్యాయి. ఈ సాంగ్ ని జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు.
అయితే ఈ సాంగ్ లో హుక్ స్టెప్ ని రామ్ చరణ్ స్వయంగా కంపోజ్ చేసినట్టుగా జానీ మాస్టర్ రీసెంట్ గా బయటపెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ సాంగ్ వింటే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ రావడం గ్యారెంటీ, చికిరి చికిరి సాంగ్ నాకు తెలిసి 10 లక్షల సార్లు విని ఉంటా.. కానీ ఇప్పటికీ ఆ పాట వస్తే నాకు లేచి డాన్స్ చేయాలనిపిస్తోంది..
అసలు ఈపాటలో హుక్ స్టెప్ ని రామ్ చరణ్ కంపోజ్ చేసారు. కానీ రామ్ చరణ్ క్రెడిట్ తాను తీసుకోకుండా తనకే ఇచ్చినట్టుగా జానీ మాస్టర్ ఓ బుల్లితెర డాన్స్ షో లో బయటపెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఇది విన్న మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ క్రియేటివిటీకి తెగ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.





అల్లు వారింట మొదలైన పెళ్లి సంబరాలు 
Loading..