Advertisementt

24 గంటల్లో శంకరవర ప్రసాద్ గారు రికార్డ్

Fri 13th Feb 2026 06:35 PM
zee5  24 గంటల్లో శంకరవర ప్రసాద్ గారు రికార్డ్
Mana Shankara Vara Prasad Garu Hits Another Milestone 24 గంటల్లో శంకరవర ప్రసాద్ గారు రికార్డ్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర వర ప్రసాద్ గారు, డిజిటల్ వరల్డ్ లో మరో రికార్డును బద్దలు కొట్టింది. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అద్భుతాలు సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బిగ్గెస్ట్ రీజినల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు OTTలో అదరగొడుతోంది. ZEE5లో ప్రీమియర్  తెలుగు సినిమా ఇంతకు ముందు ఎన్నడూ చూడని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది

డిజిటల్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే, MSG 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసింది, ఇది ప్లాట్‌ఫామ్‌లో ఒక తెలుగు చిత్రానికి ఇప్పటివరకు లభించిన బిగ్గెస్ట్  ఓపెనింగ్‌గా నిలిచింది. ఈ అద్భుతమైన నెంబర్  సినిమాపై  ప్రేక్షకులలో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్సయిట్మెంట్ ని ప్రజెంట్ చేస్తోంది. బాక్సాఫీస్‌ను ఏలిన సినిమాలు కూడా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అరుదుగా మాత్రమే బిగ్ నెంబర్స్ సాధిస్తాయి,  ఇప్పుడు MSG అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది.  

ఈ సెన్సేషనల్ రెస్పాన్స్ కి  మెగాస్టార్ చిరంజీవి ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన కామిక్ టైమింగ్ ప్రధాన పాత్ర పోషించాయి. ఆయన కరిజ్మా ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసింది. అనిల్ రావిపూడి కలర్‌ఫుల్ కామెడీ, హార్ట్‌ఫెల్ట్ డ్రామాతో రూపొందిన MSG థియేటర్లలతో  పాటు ఓటీటీలో కూడా సమానంగా అలరిస్తోంది.

Mana Shankara Vara Prasad Garu Hits Another Milestone:

Mana Shankara Vara Prasad Garu Hits Another Milestone, Becomes The Biggest Opening Ever On ZEE5

Tags:   ZEE5
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ