మాస్ మహారాజ్ రవితేజ వరస ప్లాప్ లతో సతమయ్యే క్రమంలో సంక్రాంతికి వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి కాస్త రిలీఫ్ నిచ్చింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి జస్ట్ యావరేజ్ అయినా రవితేజ కు కాస్త ఊరట లభించింది. అయితే రవితేజ ప్లాప్ లు ఒక ఎత్తు ఆయన పారితోషికం విషయంలో చాలా స్ట్రిట్ గా ఉంటాడు అనే కంప్లైంట్ ఒక ఎత్తు.
ఆయన సినిమా రిజల్ట్స్ తో పనిలేకుండా డిమాండ్ చేస్తారు, ప్రమోషన్స్ కి పెద్దగా రారు అంటారు. కానీ భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రమోషన్స్ విషయంలో కాస్త మారారు, ఇప్పుడు పారితోషికం విషయంలోనూ రవితేజ లో మార్పొచ్చింది అనే టాక్ వినబడుతుంది. బడ్జెట్ విషయాల్లో అలాగే పారితోషికం విషయంలో రవితేజ చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారట.
ప్రస్తుతం రవితేజ రెమ్యునరేషన్ 20–25 కోట్లుగా ఉండటమే కాక ఆయన చేస్తున్న సినిమాల బడ్జెట్ 40–50 కోట్లను దాటుతోంది. అటు ఇటుగా మిగతా నటులు పారితోషికాలతో కలిపి బడ్జెట్ రూ.100 కోట్లకు చేరడంతో రవితేజ పై అంత బడ్జెట్ వర్కౌట్ కాదనే అభిప్రాయం చాలామంది నిర్మాతల్లో స్టార్ట్ అయ్యింది.
దానితో రవితేజ కూడా కాస్త తగ్గి పారితోషికం విషయంలో ఇలా అయితే కష్టమని ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తగ్గించి లాభాల్లో షేర్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారని ఇండస్ట్రీలో టాక్ వినబడుతుంది. ఇది రిస్క్ అయినా రవితేజ తప్పదని భావిస్తున్నారట. సో మార్పు మంచిదేగా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.





24 గంటల్లో శంకరవర ప్రసాద్ గారు రికార్డ్ 
Loading..